సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ కుట్రలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయించింది. డీఎస్సీపై వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టిన వెంటనే వీడియోలను తొలగించారు. ఫేక్ అకౌంట్లతో మెటాకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మరో వైపు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి ప్రభుత్వం.. 20కిపైగా వైఎస్సార్‌సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు కూడా బ్లాక్ చేయించింది.
సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు వెనుక ఏపీకి చెందిన సైబర్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ స్కామ్ వార్తలు పెట్టినందుకే సోషల్ మీడియా అకౌంట్ల బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.
ఇదీ చదవండి: జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్


