సాక్షి,చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గుడిపాల మండలం మందికృష్ణాపురంలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గం ఇంఛార్జి విజయానంద రెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.


