breaking news
Social relationships
-
‘నీకు ఓ విషయం చెప్పాలి.. మళ్లీ ఎవరికీ చెప్పొద్దు!’
‘‘నీకో విషయం చెప్పాలి.. కానీ ఎవరికీ చెప్పకూడదు!’’ ఇలాంటి మాట వినగానే చాలామందికి ఆసక్తి పెరిగిపోతుంది. స్నేహితుల మధ్యైనా, ఆఫీసులోనైనా, కుటుంబంలోనైనా.. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడటం రోజువారీ మాటల్లో ఒక భాగమైపోయింది. అయితే దానిని వెంటనే ‘గాసిప్’ అంటూ చెడ్డ అలవాటుగా ముద్ర వేస్తాం. కానీ శాస్త్రవేత్తలు మాత్రం గాసిప్‌ను అంత సులభంగా చెడ్డదిగా చూడటం లేదు. గాసిప్ అనేది మనుషుల సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన ΄ాత్ర పోషించే సాధనం కూడా కావచ్చని అంటున్నారు.గాసిప్ అంటే సాధారణంగా మనం మన దగ్గర లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం అని అనుకుంటాం.. కానీ ఇతరుల వ్యక్తిగత విషయాలు, నిర్ధారణ లేని వార్తలు, ఇతరుల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా వ్యాప్తి చేసే సంభాషణలను కూడా గాసిప్ అంటారు.ఎందుకంత కుతూహలం!చాడీలు, రూమర్లు అనేవి కొత్తగా వచ్చిన అలవాటేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఇతరుల గురించి తెలుసుకోవడం, ఎవరు నమ్మదగినవారు? ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎవరి మాట నమ్మాలి? వంటి విషయాలు తెలుసుకోవడం సహజంగానే సాగుతుంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకరి గురించి సమాచారాన్ని పంచుకుని, ఇతరులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఒక రకమైన ఉపయోగం కావచ్చు. అదే సమయంలో, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఒకరిని బ్లేమ్ చేసేందుకు అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం హానికరమైన గాసిప్‌గా మారుతుంది.ఆఫీసుల్లోనూ గాసిప్స్‘ఆఫీసులో గాసిప్ చేయకూడదు’ అని ఎన్ని నియమాలు పెట్టినా.. ఉద్యోగుల మధ్య అనధికారిక చర్చలు ఉండటం సహజం. ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? వంటి సమాచారాన్ని ఉద్యోగులు పరస్పరం పంచుకుంటుంటారు. ఇలాంటి సమాచారం కొన్నిసార్లు సహకారాన్ని పెంచవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లోనూ పడేయవచ్చు. అనుమానాలు సృష్టించడం, నమ్మకాన్ని కోల్పోయేలా చేయడం, సంబంధాలను దెబ్బతీయడం మాత్రమే ఉద్దేశమైతే.. అది హానికరమైనదే.గాసిప్ అనేది జీవితంలో ఒక భాగమే అయినప్పటికీ.. పరిశోధనలు సూచించేది ఏమిటంటే.. గాసిప్ ఉందా లేదా అన్నది కంటే, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. మంచి గాసిప్ సమాచారం ఇవ్వొచ్చు.. స్నేహాన్ని బలపరచొచ్చు.. అవసరమైనప్పుడు ఇతరులను జాగ్రత్తపరచొచ్చు. కానీ అవే గాసిప్స్ ఒక్కోసారి సంబంధాలను దెబ్బతీయొచ్చు.. నమ్మకాన్ని కోల్పోయేలా చేయొచ్చు.. నష్టం కలిగించవచ్చు.– నిర్వహణ: రమా జంబులఇవి కూడా చదవండి: ప్రాథమిక చికిత్సలో ప్రథములమవుదాం -
ఒంటరి.. డిజిటల్ దరి
సాక్షి, స్పెషల్ డెస్క్ : పట్టణీకరణ, పని ఒత్తిడి, మారుతున్న సామాజిక సంబంధాలు.. కారణం ఏదైనా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేవలం పనిముట్టుగా మాత్రమే కాకుండా మనుషులకు ఒక ‘డిజిటల్ తోడు’గా మారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది వినియోగదారులు ఏఐ కంపానియన్ యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 18–30 ఏళ్ల వయసు వారు ఈ యాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ యాప్స్ మనుషులతో స్నేహితుల్లా లేదా ఒక తోడులా సంభాషిస్తున్నాయి. సాధారణ చాట్‌బాట్స్ కంటే ఇవి భిన్నమైనవి. వినియోగదారుల భావోద్వేగాలను అర్థం చేసుకొని వారికి తగినట్లుగా స్పందిస్తాయి.ఐటీ ఉద్యోగుల వాడకమే అధికం..వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా కేవలం కాలక్షేపం కోసం ‘డిజిటల్ స్నేహితుల’తో యూజర్లు గంటల తరబడి గడుపుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని యువత, ఐటీ ఉద్యోగులు వాటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటి వాడకం వల్ల వినియోగదారుల్లో 30% నుంచి 50% వరకు సానుకూల మార్పు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగిస్తున్నట్లు అంచనా. యూజర్లపరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది.ఇదీ మార్కెట్..నాస్కామ్ లెక్కల ప్రకారం 2024లోప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్ మార్కెట్ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 30.8% వార్షిక వృద్ధిరేటుతో 2030 నాటికి 140.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం 2024లోభారత్లో ఏఐ కంపానియన్ మార్కెట్ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. 40.4% వార్షిక వృద్ధితో 2030 నాటికి 7.9 బిలియన్ డాలర్లనుతాకుతుందని అంచనా.రోజుకు 45 నిమిషాలు..» భారత్‌లో ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగం ప్రపంచ సగటు కంటే 40% వేగంగా పెరుగుతోంది.» సగటున ఒక్కో వినియోగదారు రోజుకు45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు.» వినోదం కోసమే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఆధారం: నాస్కామ్, సెన్సార్ టవర్, టెక్నావియో, గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రయోజనాలు ఇవీ..» సామాజికంగా ఒంటరినని బాధపడే వారికి ఈ యాప్స్ 24/7 అందుబాటులో ఉండే స్నేహితుడిలా తోడుంటాయి. » కొన్ని యాప్స్ ఒత్తిడి,ఆందోళన, కుంగుబాటుతగ్గించడానికి ‘కాగ్నిటివ్బిహేవియరల్ థెరపీ’ పద్ధతులను వాడుతూసహాయపడతాయి. » మనుషులతో మాట్లాడితే వారు మనల్ని జడ్జ్ చేస్తారనే భయం ఉంటుంది. కానీ ఏఐతో ఎలాంటి సంకోచం లేకుండా మనసులోని మాటలు పంచుకోవచ్చు.నష్టాలూ ఉన్నాయి» మన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల డేటా హ్యాక్ అయ్యే లేదా ప్రకటనల కోసం అమ్ముడయ్యే ప్రమాదం ఉంది. » మనుషుల కంటే ఏఐతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల నిజజీవితంలో సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయి, మనుషులతో మాట్లాడటం కష్టంగా మారవచ్చు. » మనుషులు ఏఐ స్నేహితులకు బానిసలుగా మారే ప్రమాదం. » ఏఐ ఇచ్చే సలహాలు వాస్తవ విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉండే అవకాశం. -
నా వెంటే... ఓరుగల్లు నీతి, నిజాయితీ
జస్టిస్ నర్సింహారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా సాహిత్య, సాంసృ్కతిక, కళలకు నిలయమని.. రామప్ప దేవాలయ నిర్మాణ కళకు ప్రపంచంలోనే సరితూగే మరో నిర్మాణం లేదని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. ఇక్కడి సామాజిక సంబంధాలు, ప్రతిస్పందన లు, మానవత్వం పునాదిగా ఉంటాయని, బమ్మెర పోతన రచనల నుంచి నేర్చుకున్న నిబ ద్ధత, నిజాయితీ ఎల్లప్పుడూ తన వెంటే ఉం టాయని ఆయన పేర్కొన్నారు. పాట్నా హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తు న్న నర్సింహారెడ్డిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో సోమవా రం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల నడుమ బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు నర్సింహారెడ్డిని సభా ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. సేవా కార్యక్రమాలు చేపట్టాలి న్యాయవాదులు, న్యాయమూర్తులు.. సమస్య ల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని నర్సింహారెడ్డి కోరారు. గ్రామీణ జీవన నేపథ్యం ఉన్న వ్యక్తులు సామాజిక సేవ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సన్మార్గంలో సంపాదించిన సొమ్ముతోనే సంతృప్తి లభిస్తుందని, అక్రమ మార్గంలో ప్రయాణం మొదలుపెడితే పతనం ఖాయమని తెలిపారు. అవసరానికి మించి ఆస్తులు ఉన్న వారు ఆకారపు, కొమురవెళ్లి వంశస్తులను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. కాగా, తాను ఎక్కడికి వెళ్లినా వరంగల్ జిల్లా ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంపొందించే లా పనిచేస్తానని, జిల్లా న్యాయవాదులకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన గుడిమల్ల రవికుమార్, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న నర్సింహారెడ్డి త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాల ని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి మఠం వెంకటరమణ, అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, కృష్ణయ్య, సాల్మన్‌రాజ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూరం నర్సింహస్వామి, ఓరుగంటి కోటేశ్వర్రావు, సందసాని రాజేంద్రప్రసాద్, కొలునూరి సుశీల, సుదర్శన్, ఎం.మంజుల, సురేష్, ఆశీర్వాదం, దామోదర్, వివి.గిరి, వివిధ ప్రాం తాల న్యాయవాదులు పాల్గొన్నారు.


