breaking news
Flesh-eating disease
-
'మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..
'మాంసాన్ని తినే వ్యాధి' అనే పేరు వినగానే ఎవరికైనా భయం, ఆందోళన కలగడం సహజం. ఈ వ్యాధి శాస్త్రీయ నామం 'నెక్రోటైజింగ్ ఫాసిటిస్' అని చెబుతున్నారు వైద్యులు. దీనికి చికిత్స సైతం అందుబాటులో ఉందట. వినడానికే భయం కలిగిస్తున్న ఈ వ్యాధి ఏంటో, ఎందువల్ల వస్తుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నెక్రోటైజింగ్ ఫాసిటిస్గా వ్యవహరించి మాంసాన్ని తినే వ్యాధి చర్మం క్రింద ఉండే మృదు కణజాలాన్ని ప్రభావితం చేసే ఒక అరుదైన ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. అత్యంత అరుదైన సందర్భాలలో కళ్ల చుట్టూ కూడా రావొచ్చు. చిన్న కోత, శస్త్రచికిత్స గాయం లేదా కీటకం కాటు వంటి వాటి ద్వారా చర్మంలో ఏర్పడిన గాయం గుండా కొన్ని రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాధి బారిన పడే వారిలో చాలామందికి బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.లక్షణాలు..చికిత్స..ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా తీవ్రతరమవుతాయి. సులభంగా గుర్తించగలిగే మార్పులు ఇవి:వాపు, ఎర్రబడటంఒక నిర్దిష్ట ప్రాంతంలో నొప్పి లేదా సున్నితత్వం (స్పర్శకు నొప్పిగా అనిపించడం)అయితే, బయటకు కనిపించే దానికంటే ఆ అసౌకర్యం లేదా నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చని వైద్యులు తెలిపారు. దీనికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కణజాలాన్ని తొలగించే ప్రక్రియ అవసరం కావచ్చు అని చెబుతున్నారు వైద్యులు.నివారించడం ఎలా అంటే..నెక్రోటైజింగ్ ఫాసిటిస్ను పూర్తిగా నివారించడం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. అయితే, దీని ముప్పును తగ్గించడానికి ఇలా చేయండని చెబుతున్నారు వైద్యులు. అవేంటంటే..గాయాలను సబ్బు నీటితో శుభ్రం చేయండి. అవి నయమయ్యే వరకు శుభ్రమైన కట్టుతో (bandage) కప్పి ఉంచండి.ఏదైనా లోతైన కోత లేదా గుచ్చుకున్న గాయం అయినట్లయితే వైద్యుడిని సంప్రదించండి.చర్మంపై గాయం లేదా కోత ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్, హాట్ టబ్స్ లేదా బయట ఉండే నీటి వనరులలోకి వెళ్లకండి. View this post on Instagram A post shared by Kunal Sood, MD (@doctorsoood) (చదవండి: షాంపూ బదులు.. ప్రకృతి సిద్ధమైన ప్రత్యామ్నాయం ఇదే! వైద్యులు సైతం..) -
కండరాలను తినేసే వ్యాధి..!
మెడిక్షనరీ ఆ వ్యాధి పేరే కండరాలను తినేసే వ్యాధి. ఇంగ్లిష్లో దాన్ని ‘ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్’గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో నెక్రొటైజింగ్ ఫ్యాషియైటిస్ అని పిలిచే ఈ వ్యాధి ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోకపోతే అది కాస్త ప్రమాదకరంగా కూడా మారే అవకాశం కూడా ఉంది. చర్మంపై చిన్న చిన్న గాయాలు, గాట్లు, ఏవైనా కీటకాలు కుట్టడం వల్ల ‘గ్రూప్-ఏ స్ట్రెప్టోకోకస్’ (జీఏఎస్) అనే బ్యాక్టీరియా చర్మంలోకి చేరుతుంది. చర్మం కింద ఉంటే సూపర్ఫీషియల్ ఫేషియా అనే కనెక్టివ్ కణజాలంలోకి ఆ బ్యాక్టీరియా విస్తరిస్తుంది. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలతో పాటు నీళ్ల విరేచనాలు, జ్వరం, మగతగా ఉండటం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే రక్తపోటు పడిపోవడం జరుగుతుంది. ఇంట్రావీనస్ యాంటీబయాటిక్ థెరపీ, ఒక్కోసారి చర్మంపై చచ్చుబడిపోయిన మేరకు మృతకణాజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగించడం, మందులతో పడిపోయిన రక్తపోటును మళ్లీ యథాతథ స్థితికి తేవడం, ఒక్కోసారి రక్తమార్పిడి, ఇమ్యూనోగ్లోబ్యులిన్ వంటి మందులను రక్తనాళానికి ఎక్కించడం (ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్) ... వంటి ప్రక్రియలతో డాక్టర్లు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్కు చికిత్స అందిస్తారు.


