చొరబాటు దారులను తరిమేస్తాం: అమిత్‌ షా  | Amit Shah Seemanchal crackdown before Bengal polls | Sakshi
Sakshi News home page

చొరబాటు దారులను తరిమేస్తాం: అమిత్‌ షా 

Feb 27 2026 4:58 AM | Updated on Feb 27 2026 4:58 AM

Amit Shah Seemanchal crackdown before Bengal polls

అరారియా: భారత నేల నుంచి ప్రతి చొరబాటుదారుడిని తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. వారిని కేవలం ఓటరు జాబితా నుంచే కాక.. భారత నేల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని చెప్పారు. పశి్చమ బెంగాల్‌లో అసె ంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్‌ లోని సీమాంచల్‌ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. 

బంగ్లాదేశ్‌–నేపాల్‌ సరిహద్దు వెంబడి బీహార్‌లోని కిషన్‌గంజ్, అరారియా, పూర్ని యా, కతిహార్‌ జిల్లాలతో కూడిన సీమాంచల్‌ ప్రాంతంలో షా మూడు రోజుల పర్యటనను ప్రారంభించారు. గురువారం అరారియాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. బీహార్‌లో సీమాంచల్‌ నుంచే చొరబాటుదారుల ఏరివేత ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పశి్చమ బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రతి చొరబాటుదారుడిని తరిమికొడతామని నొక్కి చెప్పారు. చొరబాటుదారులు జాతీయ భద్రతకు ముప్పుగా ఆయన అభివరి్ణంచారు. బీహార్, జార్ఖండ్, పశి్చమబెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచే జనాభాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని, జనాభా సమతుల్యతను, ఆయా ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

వీడీ సావర్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఘన నివాళులరి్పంచారు. ‘భారత విప్లవకారుడు వీర్‌ సావర్కర్‌ వర్ధంతి. ఆయన స్వాతంత్య్ర పోరాటంలో యోధుడే కాదు.. నిర్భయమైన దేశ భక్తుడు కూడా. తన సాహిత్యంతో దేశంలో దేశ భక్తిని రగిలించారు. అంటరాని తనం నర్మూలన, జాతీయ దృక్పథం కోసం సావర్కర్‌ అపారమైన కృషి చేశారు. సావర్కర్‌కు నా నివాళులు’అని అమిత్‌ షా పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement