breaking news
Intruder
-
అరుదైన అంతరిక్ష అతిథి
అదో అరుదైన అంతరిక్ష అతిథి. ఇంకా చెప్పాలంటే మన సౌర మండలంలోకి దూసుకొచ్చిన చొరబాటుదారు. అదే... 3ఐ/అట్లాస్‌గా పిలుస్తున్న తోకచుక్క! అది అనంత విశ్వంలో సుదీర్ఘయానం చేసి మరీ మన చెంతకు వచ్చింది. ఆ క్రమంలో భూమికి నష్టమేమైనా చేస్తుందేమోనని సైంటిస్టులు కలవరపడ్డా, అలాంటిదేమీ లేకుండానే తన మార్గాన తిరిగి సుదూర విశ్వంలోకి వెళ్లిపోతోంది! దాంతో అంతా హమ్మయ్యా అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు...! మతి పోగొడుతున్న ఫొటోలు 3ఐ/అట్లాస్ శుక్రవారం రాత్రి, అంటే డిసెంబర్ 19న భూమికి సైంటిస్టులు ముందుగా వేసిన అంచనా కంటే కూడా అతి సమీపానికి వచ్చింది. 1.8 ఆస్ట్రనామికల్ యూనిట్ల (27 కోట్ల కిలోమీటర్లు) సమీపానికి అని వారు భావించగా, అది ఏకంగా 1.4 ఆస్ట్రనామికల్ యూనిట్ల (20 కోట్ల కి. మీ.) సమీపానికి వచ్చేసింది. ఆ సందర్భంగా ఉటా అబ్జర్వేటరీ తీసిన ఫొటో అందరినీ అలరిస్తోందిప్పుడు. అందులో 3ఐ/అట్లాస్ రెండు తోకలతో వింత హొయలు పోతూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లియో నక్షత్ర మండలంలోని తారలు తళుక్కుమంటూ కనువిందు చేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చొరబాటుదారుణ్ణి మట్టుబెట్టిన బీఎస్ఎఫ్
రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అతనిని మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ఎఫ్ వెల్లడించింది.ప్రస్తుతం సరిహద్దుల్లో హై అలర్ట్ అమలులో ఉందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తరన్‌తారన్ జిల్లాలోని దాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి కంచె సమీపంలోకి వస్తున్న వ్యక్తి కనిపించాడని ఆయన తెలిపారు. అప్పుడు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారునితో తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతను అధికారుల సూచనలు వినకుండా సరిహద్దు భద్రతా కంచె వైపు వస్తూనే ఉన్నాడు.ప్రమాదాన్ని పసిగట్టిన డ్యూటీలోని సైనికులు ఆ చొరబాటుదారునిపై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భారత ఆర్మీ మరోమారు చొరబాటుదారుడియత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్‌లోని 553 కి.మీ. పొడవైన భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. -
'తప్పుదోవ పట్టించారు..' నిందితుడు సాగర్ శర్మ తల్లి ఆవేదన
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై నిందితుడు సాగర్ శర్మ తల్లి స్పందించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన కుమారుడు అమాయకుడని, తప్పుదోవ పట్టించి, కుట్రలో ఇరుకించారని ఆరోపించారు. సాగర్ దేశ భక్తి గల వ్యక్తి అని చెప్పారు. 'స్నేహితున్ని కలవడానికి ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పాడు. రెండ్రోజుల్లో వస్తానని అన్నాడు. నా కొడుకుని ఎవరో కుట్రలో ఇరికించారు. ఆటో నడిపేవాడు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడే నా ఆధారం. ప్రతి రోజు దాదాపు రూ.500 వరకు సంపాదించేవాడు. చాలా అమాయకుడు. మంచి వ్యక్తిత్వం గలవాడు. దేశం పట్ల ఎప్పుడు భక్తిభావంతో ఉండేవాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎవరో అతనికి ఇవన్నీ నూరిపోశారు. కుట్రలో ఇరికించారు.' అని సాగర్ తల్లి రాణి శర్మ అన్నారు. కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని సాగర్ సోదరి మహి శర్మ కోరారు. తన సోదరున్ని ఈ కేసులో ఇరికించిన వారిని కఠినంగా శిక్షించాలి అని ప్రధాని మోదీకి విన్నవించారు.' నా సోదరుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. మంచి దేశ భక్తుడు. దేశ అభివృద్ధి గురించి మాట్లాడేవాడు. ఆగష్టు 15కు ఆటోపై మూడు రంగుల జెండా పెట్టుకునేవాడు' అని సాగర్ సోదరి మహి శర్మ తెలిపింది. Parliament intruder's mother and sister claim his innocence, says he is getting framed, appeals for fair probe Read @ANI Story | https://t.co/A0OYCYyaoa#Parliament #SecurityBreach #Intruders pic.twitter.com/veM1JR1iNv — ANI Digital (@ani_digital) December 14, 2023 అయితే.. నిందితులందరూ సోషల్ మీడియా పేజీ 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్'తో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏడాదిన్నర క్రితం అందరూ మైసూరులో కలిశారు. సాగర్ జూలైలోనే లక్నో నుంచి వచ్చాడు.. కానీ పార్లమెంట్ హౌజ్ లోపలికి వెళ్లలేకపోయాడు. డిసెంబర్ 10 నుంచి నిందితులందరూ ఒక్కొక్కరిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా గేట్ వద్ద గ్యాస్ క్యానిస్టర్లను పంచుకున్నారని పోలీసులు గుర్తించారు. లక్నోలోని మానక్నగర్ ప్రాంతంలో సాగర్ శర్మ నివాసం ఉంటున్నాడు. వామపక్ష భావాజాలంతో ఫేస్బుక్ పోస్టులు చేస్తుండేవాడని పోలీసులు గుర్తించారు. కోల్‌కతా, హర్యానా, రాజస్థాన్‌కు చెందిన చాలా మందితో సాగర్ శర్మకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఫేస్బుక్ పేజీలో యాక్టివ్‌గా లేరని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా నుంచి లక్నోకు వలస వచ్చిన సాగర్ కుటుంబం.. ఇక్కడే గత 20 ఏళ్ల నుంచి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తండ్రి, తల్లి, సోదరితో సాగర్ ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
దాడి చేసిన దొంగకు తిండి పెట్టి మరీ సాగనంపి..!
ఎవరైనా దొంగ ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం.. పోలీసులకు పట్టిస్తాం. వీలైతే దాడి నుంచి తప్పించుకుంటాం.. తప్పని స్థితిలో ప్రతిదాడి చేస్తాం కదా..! కానీ ఎవరైనా దొంగకు తిండి పెట్టి మరి సాగనంపుతామా? వింటేనే నవ్వొస్తుంది కదా..! అమెరికాలో ఓ మహిళ తన ఇంట్లోకి చొరబడిన దొంగకు తిండి పెట్టి మరీ సాగనంపి గొప్ప మనసు చాటుకుంది. ఆమె పేరు మార్జోరీ పార్కిన్స్(87) ఒంటరిగా నివసిస్తోంది. జులై 26 అర్థరాత్రి తన ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి దాడికి యత్నించాడు. ఇది గమనించిన పార్కిన్స్ తనను తాను కాపాడుకోవడానికి ప్రతిదాడి చేసింది. ఈ క్రమంలో ఆ దొంగ.. ఆమెను నెట్టివేశాడు. దీంతో ఆమె కిచెన్‌లోకి చేరుకోగలిగింది. అయితే.. కిచెన్‌లోకి చెరుకున్నాక దొంగను డోర్‌తో నిలువరించింది. ఈ క్రమంలో దొంగ.. తనకు ఆకలిగా ఉందని తెలిపాడు. ఈ దయగల పార్కిన్.. అతనికి ఆహారాన్ని అందించి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపు ఆ దొంగ చక్కగా తినేసి.. ఏ వస్తువులను తీసుకుపోకుండా అన్నీ అక్కడే వేసి పారిపోయాడు. నేరాలు ఇలా జరగడం దురదృష్టంగా భావించిన పార్కిన్.. నేరస్థులకు శిక్షలు సరిగా వేయడం లేదని అన్నారు. తాను 42 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నానని ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురవలేదని చెప్పారు. చట్టాలను ప్రజలు లెక్కచేయలేని స్థితిలో ఉన్నాయని వాపోయారు. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. -
మారువేషంలో దొంగగా వచ్చి అత్తను చితకబాదిన కోడలు.. కానీ..!
తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. మారువేశంలో దొంగగా వచ్చిన కోడలు అత్తను చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన అత్త ప్రాణాలు కోల్పోయింది. తిరునల్వేలి జిల్లాలోని వడుకనపట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో శణ్ముగవేలు భార్య సీతారామలక్ష్మి (57). వారికి కుమారుడు రామస్వామి, కోడలు మహాలక్ష్మి ఉన్నారు. ఇంట్లో అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో పరిస్థితిని మెరుగుపరచడానికి రామస్వామి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మకాం మార్చినా.. ప్రయోజనం లేకపోయింది. ఇటీవల జరిగిన గొడవ అనంతరం అత్తపై కక్ష పెంచుకున్న మహాలక్ష్మి పథకం వేసింది. మగవారి వేశం వేసి హల్మెట్ పెట్టుకుని అత్త నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసింది. అత్త నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లింది. తీవ్ర గాయాలపాలైన అత్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులకు సీసీటీవీ అధారాలతో అసలు విషయం బయటపడింది. కోడలే ఈ ఘటనకు కారకురాలని తేల్చారు. చదవండి:కంపెనీ డబ్బుతో డ్రైవర్ పరార్... ఓనర్ ఏం చేశాడంటే... -
మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి
అర్జెంటీనా లియోనల్ మెస్సీని ఒక అభిమాని భయపెట్టాడు. ప్రస్తుతం మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) తరపున యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్(UEFA)లో ఆడుతున్నాడు. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బెయర్న్ మ్యునిచ్‌తో మ్యాచ్ జరిగింది. కాగా లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని రీతిలో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఒక వ్యక్తి మెస్సీని పట్టుకోబోయాడు. అయితే మెస్సీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఇది గమనించిన సిబ్బంది రంగప్రవేశం చేసి అతన్ని బయటకు తీసుకెళ్లారు. కానీ అజ్ఞాతవ్యక్తి చర్య మెస్సీని భయపెట్టినట్లుగా అతని ఎక్స్ప్రెషన్ ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో బెయర్న్ మ్యునిచ్ 2-0 తేడాతో పీఎస్జీ జట్టుపై విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఎరిక్ మాక్సిమ్ మోటింగ్(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్ చేశారు. కాగా బెయర్న్ మ్యునిచ్ యూఈఎఫ్ఏలో క్వార్టర్స్ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. A pitch invader tried to slide tackle Messi after the game yesterday 😳 But Messi just side-stepped the tackle and kept walking on 😂 This man used to dribble past Ramos, Pepe, Vidic and Van Dijk. What was the fan thinking 😭😭💀pic.twitter.com/FsBySjTJBO — IG: TheFootballRealm (@theftblrealm) March 9, 2023 చదవండి: PSL 2023: ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు -
స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. రిమాండ్‌కు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన కేసులో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌తో పాటు అతని స్నేహితుడు బాబును అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద కేసు వాళ్లపై నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను జడ్జి ఎదుట హాజరు పరచగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఆపై చంచల్‌గూడ్‌కు తరలించారు ఇద్దరిని. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా పౌరఫరాశాఖ కార్యాలయంలో ఆనంద్ కుమార్ రెడ్డి(45) డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. కాగా తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని స్మితా సబర్వాల్ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని ఆనంద్ కుమార్ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని ప్లెజెంట్ వ్యాలీలోని ఐఏఎస్ క్వార్టర్స్ వద్దకు వెళ్లినట్లు చెప్తున్నాడు. అయితే అపాయింట్మెంట్ లేకుండా అదీ రాత్రి పూట ఈ ఇద్దరూ ఆమె ఇంట్లోకి వెళ్లడం, అది భద్రతా సిబ్బంది కళ్లుగప్పడంతో కేసు నమోదు అయ్యింది. -
మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన అభిమాని.. క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక సంఘటన ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతుండగానే ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఈ చర్యతో ఆటగాళ్లు సహా అంపైర్లు షాక్‌కు గురయ్యారు. అయితే సదరు వ్యక్తి ఎవరికి హాని కలిగించకుండా నేరుగా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పాక్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ వద్దకు వచ్చాడు. మొదట ఆశ్చర్యంగా చూసినప్పటికి.. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన అభిమానిని సంతోషంగా హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సంతోషంగా నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. కాగా షాదాబ్ ఖాన్ తన చర్యతో మిగతా క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఇక రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. Shadab Khan fan enter in the ground and hug him. Best moment 😍. Video of the day.#PAKvWI pic.twitter.com/c51kmIXfMl — Gokboru (@gokboru_se) June 10, 2022 చదవండి: Babar Azam: విండీస్‌తో మ్యాచ్ పాకిస్తాన్ కెప్టెన్ ‘ఇల్లీగల్ ఫీల్డింగ్’.. అందుకు మూల్యంగా.. పాక్ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్ -
టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో'
Cricket Pitch Invader Jarvo Tweets In Support Of Team India: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐపీఎల్-2021కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆసక్తికర ట్వీట్ చేశాడు. Dose India need me for the T20 World Cup?Got my full kit ready!!! #showyourgame #jarvo69 #T20WorldCup pic.twitter.com/KeCZxjJFKe— Jarvo69 (Daniel Jarvis) (@BMWjarvo) October 29, 2021 టీమిండియాకు నా హెల్ప్ ఏమైనా కావాలా..? కిట్‌తో రెడీగా ఉన్నాను.. బరిలోకి దిగడమే తరువాయి అంటూ టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరించిన సెల్ఫీని పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. జార్వో ట్వీట్‌పై టీమిండియా అభిమానులు స్పందిస్తున్నారు. జార్వో ఉంటే టీమిండియాకు కలసి వస్తుందని కొందరంటుంటే.. కోహ్లీ రాజీనామా చేసి జార్వోకు కెప్టెన్సీ ఇవ్వాలని మరొకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. దీంతో ఆదివారం(అక్టోబర్ 31) న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f— Raghav Padia (@raghav_padia) September 3, 2021 చదవండి: టీ20 ప్రపంచకప్‌లో మరో హ్యాట్రిక్.. లంక స్పిన్నర్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు -
ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన 'జార్వో' మళ్లీ వచ్చేశాడు..
Cricket Pitch Invader Jarvo Intrudes Field Once Again In NFL Match: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐపీఎల్-2021కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి మరోసారి మైదానంలోకి దూసుకొచ్చి వార్తల్లోకెక్కాడు. Random guy on the field at the London game dapping players up in a Jaguars jersey pic.twitter.com/FP2kF13Tnt — Barstool Sports (@barstoolsports) October 17, 2021 అయితే ఈసారి అతను ఎంట్రీ ఇచ్చింది క్రికెట్ మైదానంలోకి కాదు. లండన్‌లో జరుగుతున్న అమెరికన్ ఫుట్‌బాల్(NFL) మ్యాచ్ మధ్యలోకి. జాక్సన్ విల్లే జాగ్వార్స్, మయామీ డాల్ఫిన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతుండగా.. జార్వో, జాగ్వార్స్ జెర్సీ ధరించి ఒక్కసారిగా మైదాన ప్రవేశం చేశాడు. తాను కూడా జాక్సన్ జాగ్వార్స్ ఆటగాడినే నంటూ గతం తరహాలోనే నానా హంగామా చేశాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని మైదానంలో నుంచి లాక్కెల్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 చదవండి: T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ జట్టును వేధిస్తున్న ప్రాంక్ స్టార్ జార్వో అరెస్ట్..
లండన్: భద్రతా నియమావళిని ఉల్లంఘిస్తూ.. టీమిండియా జర్సీ ధరించి.. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధిస్తున్న ఇంగ్లండ్ ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69ను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతడు పదేపదే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించి నానా హడావుడి చేస్తున్ననేపథ్యంలో తొలుత మందలింపులతో సరిపెట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా లండన్ దక్షిణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జార్వోను అరెస్ట్ చేశారు. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 'జార్వో 69' పేరిట యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఈ టీమిండియా అభిమాని ఇప్పటి వరకు మూడుసార్లు(లార్డ్స్ టెస్ట్, లీడ్స్ టెస్ట్, ఓవల్ టెస్ట్) మైదానంలోకి ప్రవేశించాడు. తాజాగా ఓవల్ టెస్ట్ రెండో రోజు ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా మైదానంలోకి చొరబడ్డ జార్వో.. తాను టీమిండియా బౌలర్‌ని అంటూ హంగామా చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టోను ఢీకొంటూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. Jarvo is at the crease #engvsindia pic.twitter.com/XlATed4vGg — JJK (@72jjk) August 27, 2021 ఈ ఘటనతో బెయిర్‌స్టో ఒకింత అసహనానికి గురయ్యాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఓలీ పోప్ కూడా తన ఏకాగ్రత దెబ్బతినిందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరలయ్యింది. కాగా, లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసీబీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి జార్వో అరెస్ట్‌కు సిఫార్సు చేశారు. India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 చదవండి: జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో -
జార్వో మళ్లీ వచ్చేశాడు.. ఈసారి బౌలర్ అవతారంలో
లండన్: టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ దేశస్తుడు జార్వో ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుసగా లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో మైదానంలోకి దూసుకొచ్చిన జార్వో ఆటకు అంతరాయం కలింగించాడు. తాజాగా జార్వో మరోసారి మైదానంలోకి వచ్చేశాడు. ఈసారి బౌలర్ అవతారంలో వచ్చిన జార్వో బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఉమేశ్ యాదవ్ 34వ ఓవర్లో రెండు బంతులు వేసి మూడో బంతికి సిద్ధమయ్యాడు. ఇంతలో జార్వో వేగంగా మైదానంలోకి దూసుకొచ్చి రన్ తీసుకుంటూ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బెయిర్ స్టోను తగులుతూ బంతిని విసిరినట్లుగా యాక్షన్ చేశాడు. అయితే జానీ బెయిర్ స్టో జార్వోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపించింది. చదవండి: ENG Vs IND Intruder Jarvo: 'ఇంగ్లండ్ భయపడింది'.. అందుకే నిషేధం జార్వో చర్యతో టీమిండియా ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్, అంపైర్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. అనంతరం సెక్యూరిటీ వచ్చి జార్వోను మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక లీడ్స్ టెస్టు అనంతరం జార్వోపై ఆ స్టేడియం నిర్వాహకులు అతనిపై జీవతకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా జార్వో మరోసారి అదే తరహాలో చేయడంతో ఈసారి ఏకంగా ఈసీబీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాగా జార్వోపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లో టెంట్ వేసుకొని నిద్రపోయాడు Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 -
ENG Vs IND Intruder Jarvo: 'ఇంగ్లండ్ భయపడింది'.. అందుకే నిషేధం
లండన్: ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ అభిమాని జార్వో ఎవరికి రానంత పేరు సంపాదించాడు. ఒకే టెస్టు సిరీస్‌లో సెక్యూరిటీని దాటుకొని రెండుసార్లు మైదానంలోకి వచ్చిన జార్వో సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయిడు. జార్వో వ్యవహరించిన తీరు తప్పుగా ఉన్నప్పటికీ అంత సెక్యురిటీని దాటుకొని మైదానంలోకి దూసుకురావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక వరుసగా లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో తన ఎంట్రీతో ఆటకు అంతరాయం కలిగించిన జార్వోపై హెడ్డింగే స్టేడియం నిర్వాహకులు జీవితకాలం నిషేధం విధించారు. అయితే ఫ్రాంక్ స్టార్‌గా మంచి గుర్తింపు ఉన్న జార్వో అసలు పేరు డేనియల్ జార్విస్. బీఎండబ్ల్యూ జార్వో పేరుతో జార్వో నడుపుతున్న యూ ట్యూబ్చానెల్కు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉండడం విశేషం. వృత్తి పరంగా కమెడియన్, ఫిల్మ్ మేకర్, ఫ్రాంక్స్టార్గా రాణిస్తున్న జార్వోను ఒక చానెల్ ఇంటర్య్వూ చేసింది. ఈ నేపథ్యంలో జార్వో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చదవండి: Shaheen Afridi: కెరీర్లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు ►పబ్లిసిటీ కోసం టీమిండియా జెర్సీ ధరించారా.. లేకపోతే నిజంగానే ఇండియాకు అభిమానా? - స్వతహాగా నేను టీమిండియాకు వీరాభిమానిని. దాని వెనుక పెద్ద కథ ఉంది. లార్డ్స్ టెస్టు సమయంలో భారత ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో బిజీగా ఉన్నారు. ఇంగ్లండ్ జట్టుతో పోలిస్తే.. టీమిండియా ఆటగాళ్లు అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారని తెలసుకున్నా. వారితో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఈ దారిని ఎంచుకున్నా. ఈ నేపథ్యంలోనే లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాను. ఒక విధంగా ఫ్రాంక్ చేసే అవకాశం వచ్చిందని భావించా. టీమిండియా ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం మాత్రం రాలేదు. అందుకే మూడో టెస్టులో ఏకంగా బ్యాట్, ప్యాడ్స్‌తో మైదానంలోకి వచ్చేశా అని తెలిపాడు. ► మీకిష్టమైన టీమిండియా క్రికెటర్ ఎవరు? - వ్యక్తిగతంగా నేను రవిచంద్రన్ అశ్విన్‌కు వీరాభిమానిని. కానీ ఈ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ తన హావభావాలతో నా ఫెవరెట్ క్రికెటర్ల లిస్టులో చేరిపోయాడు. ► ఇండియా, ఇంగ్లండ్ మధ్య వరల్డ్‌కప్ ఫైనల్ జరిగితే మీ మద్దతు ఎవరికి ? - కచ్చితంగా టీమిండియాకే నా మద్దతు ఉంటుంది. ఇక లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ ధరించడం ద్వారా మరోసారి ఇండియన్ అయ్యాను. నా దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం. ► లీడ్స్ టెస్టు తర్వాత మీపై జీవితకాల నిషేధం పడడంపై బాధపడుతున్నారా? - అలాంటిదే లేదు.. నేను కావాలని చేసింది కాదు. టీమిండియాపై అభిమానంతో చేశాను. నా బ్యాటింగ్‌కు భయపడి ఇంగ్లండ్ జట్టు నా పై జీవితకాల నిషేధం విధించిందేమో(నవ్వుతూ). అయినా మరోసారి ఇలా చేయకపోవచ్చు. ►రవిచంద్రన్ అశ్విన్‌కు మీరు వీరాభిమాని.. ఈ మధ్యన అశ్విన్‌ను కలిసే అవకాశం వచ్చిందా? - ఇప్పటివరకు అశ్విన్‌ను కలవలేదు. కేవలం ట్విటర్లోనే అతనికి రీట్వీట్స్ చేసేవాడిని. అవకాశమొస్తే తప్పకుండా కలుస్తా. ► ఇప్పటివరకు ఒక్కసారైనా ఇండియాకు వెళ్లారా? - ఇంతవరకు ఇండియాకు మాత్రం వెళ్లలేదు. కానీ ఇప్పుడు వెళ్లాలనుకుంటున్నా. నాకు నచ్చిన ప్రదేశాల లిస్ట్‌లో తాజాగా ఇండియా కూడా చేరింది. చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు.. -
మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లో టెంట్ వేసుకొని నిద్రపోయాడు
లండన్: ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ అభిమాని జార్వో చేసిన పని అందరికి గుర్తుండే ఉంటుంది. ఆట మూడోరోజు లంచ్ విరామం అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా జార్వో భారత జెర్సీ ధరించి వచ్చాడు. మొదట అతన్ని ఎవరు గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఈ సమయంలో..'' భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే జార్వోకు ఇది కొత్త కాదట.. ఇంతకముందు జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇలాంటివి చాలా చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా జార్వో చేసిన మరోపని తాజాగా వెలుగుచూసింది. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక లార్డ్స్ టెస్టులో 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్ టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అయితే మూడో టెస్టుకు 8 రోజుల గ్యాప్ వచ్చింది. కాగా ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. చదవండి: నేను భారత ఆటగాడినే.. లార్డ్స్‌లో అజ్ఞాత వ్యక్తి హల్చల్ -
భారత్-కివీస్ మ్యాచ్‌లో కలకలం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరిగిన నాలుగో టి20 మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ప్రేక్షకులు మైదానంలోకి దూసుకురావడంతో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి వారిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. 166 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నవదీప్ సైనీ బౌలింగ్ చేస్తుండగా ప్రేక్షకుడు ఒకరు భద్రతను ఉల్లఘించి మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. అతడిని పట్టుకుని భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. తర్వాత మరో అభిమాని ఆటగాళ్ల మధ్యకు దూసుకొచ్చాడు. వెంటనే తేరుకున్న భద్రతాధికారులు అతడిని కూడా బయటకు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. (చదవండి: శాంసన్ ఏందిది..?) న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లోకి ప్రేక్షకులు చొచ్చకురావడం ఇదే మొదటిసారి కాదు. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన మూడో, చివరి టి20 మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అభిమాని ఒకరు మైదానంలోకి చొచ్చుకొచ్చి అతడికి పాదాభివందనం చేసి కలకలం రేపాడు. అభిమానిని సహృదయంతో స్వీకరించిన ధోని అతడు కప్పుకుని వచ్చిన భారత జాతీయ పతాకాన్ని కింద పడకుండా పట్టుకుని అందరి మనసులను గెలుచుకున్నాడు. కాగా, ‘వియ్ మిస్ యూ ధోని’ అంటూ అతడి అభిమానులు ఈరోజు మ్యాచ్‌లో ప్లకార్డులు ప్రదర్శించారు. (చదవండి: టీమిండియా ‘డబుల్ సూపర్’) -
మారుతి కొత్త ఇంట్రూడర్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రూడర్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇంట్రూడర్ 2019 ఎడిషన్ బైక్‌ను భారతీయ మార్కెట్లొ విడుదల చేసింది. గేర్ షిప్ట్ డిజైన్, అధునాతన బ్రేక్ పెడల్ కొత్త డిజైన్‌తో న్యూ లుక్‌ని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 1,08,162 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఆధునిక డిజైన్, ప్రీమియమ్ అప్పీల్‌తో క్రూయిజర్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని మారుతి వైస్ ప్రెసిడెంట్ దేవాషిష్ హాండా తెలిపారు. రోజు ప్రయాణంతో పాటు, వీకెండ్ రైడ్స్‌కు కూడా కొత్త మారుతి ఇంట్రూడర్ మంచి అనుభవాన్నిస్తుందని చెప్పారు. 155 సిసి ఇంజీన్, ప్రామాణికే ఏబీఎస్, పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
చొరబాటుదారుడిపై బీఎస్ఎఫ్ కరుణ
జమ్మూ: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి తుపాకీ కాల్పులకు గాయపడిన యువకుడిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్‌లోని భోల్లియన్ డా కొథే గ్రామానికి చెందిన ఫరూఖ్ అహ్మద్ సైనికులు హెచ్చరిస్తున్నా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. దీంతో సైనికులు అతనిపై కాల్పులు జరపగా బుల్లెట్ తగిలి పడిపోయాడు. చనిపోయాడని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన సిబ్బంది.. అతను బతికే ఉండటంతో వైద్యశాలకు తరలించారు. అతని వద్ద ఆయుధాలు లభించలేదనీ, మాదకద్రవ్యాల మత్తులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. -
స్ట్రెయిట్ డ్రైవ్... కవర్ డ్రైవ్... కార్ డ్రైవ్...
న్యూఢిల్లీ: క్రికెట్ మైదానంలో కుక్కలు పరుగెత్తి రావడం వల్లనో, తేనెటీగలు, ఇతర కీటకాల దాడి వల్లనో మ్యాచ్‌లు ఆగిపోవడం ఎన్నో సార్లు చూశాం! కానీ శుక్రవారం మాత్రం గతంలో ఎన్నడూ జరగని ఘటన ఇక్కడి పాలమ్ ఎయిర్‌ఫోర్స్ క్రికెట్ గ్రౌండ్లో చోటు చేసుకుంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆగంతకుడు మారుతి వేగన్ఆర్ కారుతో మైదానంలోకి దూసుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నేరుగా పిచ్పైకే వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది వచ్చి ఆపేలోపే రెండు సార్లు పిచ్‌పైనే అడ్డదిడ్డంగా కారును నడిపించాడు. మ్యాచ్ మూడో రోజు ఆట మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా జరిగిన ఈ ఘటనతో ఇరు జట్ల సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, రిషభ్ పంత్ తదితరులు ఆడుతున్నారు. ఎయిర్‌ఫోర్స్ గ్రౌండ్లోకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేని సమయంలో ఆ వ్యక్తి లోపలికి వచ్చినట్లు తెలిసింది. ఘటన జరిగిన వెంటనే మెయిన్ గేటు మూసివేసిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. మతిస్థిమితం లేకనే... తాజా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా విచారణకు ఆదేశించారు. ‘అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదు. లోపలికి వచ్చిన వ్యక్తి ఉద్దేశాలు వేరుగా ఉంటే అంతర్జాతీయ క్రికెటర్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవి. మైదానానికి బాధ్యత వహించాల్సిన సర్వీసెస్ బోర్డుతో దీనిపై మాట్లాడతాం’ అని ఖన్నా చెప్పారు. మరోవైపు పోలీసులు తమ విచారణలో 30 ఏళ్ల గిరీశ్ అనే ఆ వ్యక్తిని మానసిక రోగిగా తేల్చారు. ‘ఆ సమయంలో అతడిని చూస్తుంటేనే అదో రకంగా అనిపించింది. లుంగీ వేసుకొని అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చేశాడు. బయటికి తీసుకొచ్చి చావబాదుతున్నా కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదు. అతని మానసిక స్థితి సరిగా లేదని అప్పుడే అర్థమయ్యింది’ అని మ్యాచ్‌కు ప్రత్యక్ష సాక్షి అయిన ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. -
మరోసారి ఉగ్ర కలకలం
పఠాన్ కోట్: పంజాబ్ లోని మరోసారి ఉగ్ర కలకలం రేగింది. పఠాన్ కోట్ కు సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి అక్రమ చొరబాబుదారుడిని బీఎస్ఎఫ్ సైనికులు హతమార్చారు. మృతుడు పాకిస్థాన్ దేశస్తుడిగా అనుమానిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు సరిహద్దు దాటి మనదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని నిలువరించేందుకు ప్రయత్నించినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. అయితే వారు వెనక్కు తగ్గకపోవడంతో కాల్పులు జరిపినట్టు తెలిపాయి. వీరిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పాకిస్థాన్ వైపు పారిపోయారని పేర్కొన్నాయి. ఈ నెల ఆరభంలో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అమృతసర్ లోని సీనియర్ పోలీసు అధికారి సాల్వీందర్ సింగ్ నివాసంతో పాటు పంజాబ్ లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. -
‘మోడీ, అద్వానీ, అఖిలేష్‌లను చంపేస్తాం’
నరేంద్ర మోడీ, బీజేపీ నేత అద్వానీ, యూపీ సీఎం అఖిలేష్, బీఎస్పీ నేత మాయావతిలను చంపుతామంటూ ఓ అగంతకుడు హెచ్చరిక లేఖ రాశాడు. జూన్ 20 నాటికి వీరికి ప్రాణహాని తప్పదని యూపీలోని ఘజియాబాద్ రైల్వే పోలీసులకు లేఖ పంపాడు. పలు రైల్వే స్టేషన్లు, దేవాలయాల్లో బాంబులు అమర్చినట్టు పేర్కొన్నాడు. రైల్వే ఎస్పీకి గురువారం అందిన లేఖలో వివరాలను ఎస్పీ శివహరి తెలిపారు. లేఖలో పేర్కొన్న ప్రకారం ఢిల్లీ, ఘజియాబాద్, బులంద్షార్, కాన్పూర్, మధుర, భోపాల్ రైల్వే స్టేషన్లలో బాంబు పెట్టారు. వీటిని జూన్ 15న పేల్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఢిల్లీలోని కాళీ ఆలయం, ఘజియాబాద్‌లోని దూడేశ్వర్ నాథ్, జానకి ఆలయంలోనూ బాంబులు అమర్చినట్టు ఆగంతకుడు హెచ్చరించాడు. దీంతో అలెర్టయిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు.


