PAK vs WI 2nd ODI: మ్యాచ్‌కు ఆటంకం కలిగించిన అభిమాని.. క్రికెటర్ చర్య వైరల్

పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక సంఘటన ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతుండగానే ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఈ చర్యతో ఆటగాళ్లు సహా అంపైర్లు షాక్‌కు గురయ్యారు. అయితే సదరు వ్యక్తి ఎవరికి హాని కలిగించకుండా నేరుగా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పాక్ బ్యాటర్ షాదాబ్ ఖాన్ వద్దకు వచ్చాడు. మొదట ఆశ్చర్యంగా చూసినప్పటికి.. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన అభిమానిని సంతోషంగా హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సంతోషంగా నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. కాగా షాదాబ్ ఖాన్ తన చర్యతో మిగతా క్రికెట్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది.
ఇక రెండో వన్డేలో పాకిస్తాన్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది. పాక్ విజయంలో ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజాం,మహ్మద్ నవాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 155 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.
Shadab Khan fan enter in the ground and hug him.
Best moment 😍.
Video of the day.#PAKvWI pic.twitter.com/c51kmIXfMl— Gokboru (@gokboru_se) June 10, 2022
చదవండి: Babar Azam: విండీస్‌తో మ్యాచ్ పాకిస్తాన్ కెప్టెన్ ‘ఇల్లీగల్ ఫీల్డింగ్’.. అందుకు మూల్యంగా..