'అన్‌ లక్కీ' బ్యాటర్‌.. పాపం ఎలా ఔటయ్యాడో చూడండి..! | Unluckiest Dismissal, Batter Gets Out As Ball Deflects Off Non-Striker's Body | Sakshi
Sakshi News home page

'అన్‌ లక్కీ' బ్యాటర్‌.. పాపం ఎలా ఔటయ్యాడో చూడండి..!

Jul 17 2024 5:33 PM | Updated on Jul 17 2024 7:14 PM

Unluckiest Dismissal, Batter Gets Out As Ball Deflects Off Non-Striker's Body

ఓ బ్యాటర్‌ ఊహించని రీతిలో ఔటైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోని చూస్తే.. బ్యాటర్‌ దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడా అని అనిపిస్తుంది. బౌండరీకి వెళ్లాల్సిన బంతి ఊహించని రీతిలో బౌలర్‌ చేతిలోకి వచ్చి పడటంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.

యార్క్‌షైర్‌ సెకెండ్‌ ఎలెవెన్‌, సోమర్‌సెట్‌ సెకెండ్‌ ఎలెవెన్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది. యార్క్‌షైర్‌ బౌలర్‌ బెన్‌ క్లిఫ్‌ బౌలింగ్‌లో సోమర్‌సెట్‌ బ్యాటర్‌ నెడ్‌ లియోనార్డ్‌ స్ట్రయిట్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న క్యాసే అల్‌డ్రిడ్జ్‌ భుజానికి తాకి బౌలర్‌ చేతుల్లో పడింది. బ్యాటర్‌ వంగి బంతిని బౌండరీకి మళ్లించే ప్రయత్నం చేసినా అది బెడిసి కొట్టింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. యార్క్‌షైర్‌పై సోమర్‌సెట్‌ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేయగా,. ఛేదనలో చేతులెత్తేసిన యార్క్‌షైర్‌ 125 పరుగులకు ఆలౌటైంది.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement