
వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరిగిన టి20 సిరీస్‌ను పాకిస్తాన్ గెలుచుకుందనే విషయం కంటే మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్‌లు చేసిన పని పాక్ జట్టును ట్రోల్స్ బారిన పడేలా చేసింది. ఇద్దరి మధ్య ఏర్పడిన సమన్వయ లోపంతో విండీస్ బ్యాట్స్‌మన్ బ్రూక్స్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశారు. తప్పు నీదంటే నీది అని కాసేపు వాదోపవాదాలు చేసుకున్నారు.
ఆ సమయంలో తమ చెత్త ఫీల్డింగ్‌తో 13 ఏళ్ల కింద జరిగిన సంఘటనను రీక్రియేట్ చేశామని పాపం వారికి తెలియదు. ఇదే వారి కొంపముంచింది. అసలు విషయం ఏంటంటే.. 2008లో అచ్చం ఇదే తరహాలో షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్‌లు సమన్వయ లోపంతో ఒక క్యాచ్‌ను వదిలేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పుడు, ఇప్పుడు ప్రత్యర్థి వెస్టిండీస్ కావడం విశేషం.
సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఇఫ్తికార్ అహ్మద్, మొహ్మద్ హస్నేన్‌లను ట్యాగ్ చేస్తూ.. మాలిక్, అజ్మల్ 2.0 అంటూ ట్రోల్ చేశారు. ''ఏదైనా పాక్ క్రికెటర్లకే సాధ్యం.. చరిత్రను తిరగరాశారు''.. '' హస్నేన్ క్యాచ్ వదిలేసి సయీద్ అజ్మల్ గౌరవాన్ని పెంచాడు.''.. ''న్యూ అజ్మల్, మాలిక్‌లు.. బట్ సేమ్ ఓల్డ్ వెస్టిండీస్'' అంటూ కామెంట్స్ పెట్టారు.
Hasnain & ifti 🤝 Malik & ajmal
— Saad Irfan 🇵🇰 (@SaadIrfan967) December 16, 2021
On both occasions opponent was west indies 😂😂❤️ #PAKvWI pic.twitter.com/YQj12liy5P