స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి చొరబాటు.. అందుకే వెళ్లామన్న నిందితులు.. రిమాండ్‌కు తరలింపు

Police arrest Two for intruding Smitha Sabharwal House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ ఇంట్లోకి చొరబడిన కేసులో ఇద్దరిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌తో పాటు అతని స్నేహితుడు బాబును అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అక్రమ చొరబాటు, న్యూసెన్స్‌ కింద కేసు వాళ్లపై నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితులను జడ్జి ఎదుట హాజరు పరచగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. ఆపై చంచల్‌గూడ్‌కు తరలించారు ఇద్దరిని. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మేడ్చల్‌ జిల్లా పౌరఫరాశాఖ కార్యాలయంలో ఆనంద్‌ కుమార్‌ రెడ్డి(45) డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. కాగా తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని స్మితా సబర్వాల్‌ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని ఆనంద్‌ కుమార్‌ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని ప్లెజెంట్‌ వ్యాలీలోని ఐఏఎస్‌ క్వార్టర్స్‌ వద్దకు వెళ్లినట్లు చెప్తున్నాడు. అయితే అపాయింట్‌మెంట్‌ లేకుండా అదీ రాత్రి పూట ఈ ఇద్దరూ ఆమె ఇంట్లోకి వెళ్లడం, అది భద్రతా సిబ్బంది కళ్లుగప్పడంతో కేసు నమోదు అయ్యింది.   

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top