యూఏఈకి బయిలుదేరిన మోదీ | Modi left for UAE tour | Sakshi
Sakshi News home page

యూఏఈకి బయిలుదేరిన మోదీ

May 15 2026 9:20 AM | Updated on May 15 2026 12:03 PM

Modi left for UAE tour

ఢిల్లీ: భారత ‍ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనకు బయిలుదేరారు. ఈ రోజు ( శుక్రవారం) నుంచి ఈ నెల 20 వరకూ ఆయన పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో మోదీ పర్యటించనున్నారు. ఆయా దేశాధినేతలతో కీలక చర్చలు ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు.

ఐదు దేశాల పర్యటనలో భాగంగా  మోదీ తొలుత   యూఏఈకి వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. అనంతరం అబుదాబిలో యూఏఈ అధినేతతో భోజనం చేస్తారు. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఇంధనంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ నుంచి  భారత్‌కు అధికంగా చమురు సరఫరా జరిగేలా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. యూఏఈ పర్యటన తర్వాత యూరప్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement