యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. యుఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలకడానకి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. యుఏఈ అధ్యక్షున్ని కౌగిలించుకొని సాదరంగా స్వాగతం పలికారు.
ఈ వివరాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "నా సోదరుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్‌కు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. ఆయన పర్యటన భారత్‌కు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. యూఏఈ అధ్యక్షునితో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.
ఇరువురు దేశాధినేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహర భద్రత, తదితర అంశాలలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.


