వర్షాకాలంలో.. వావ్‌ అనిపించే వనాకా! | Wanaka New Zealand Is A Beautiful Place Worth Visiting | Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో.. వావ్‌ అనిపించే వనాకా!

Jun 29 2026 8:55 AM | Updated on Jun 29 2026 11:34 AM

Wanaka New Zealand Is A Beautiful Place Worth Visiting

వనాకా, న్యూజిలాండ్‌

వర్షాకాలంలో ప్రశాంతమైన డెస్టినేషన్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా? వనాకా చూస్తే ఫస్ట్‌ గ్లాన్స్‌లోనే కామ్‌ ఫీలింగ్‌ వస్తుంది. ఫస్ట్‌ టైమ్‌ న్యూజీలాండ్‌ ఎక్స్‌ప్లోర్‌ చేయాలనుకున్న వాళ్లకి ఇది రిలాక్స్‌డ్‌ ఛాయిస్‌ అవుతుంది.

లేక్, మౌంటెన్స్‌, ఫ్రెష్‌ ఎయిర్‌ కలిసి స్లో ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ని బ్యూటిఫుల్‌గా మార్చేస్తాయి. తేలికగా వర్షం పడుతుంటే లేక్‌ పైన మిస్ట్‌ చాలా ప్రశాంతంగా ఉంటుంది. గ్రీన్‌ హిల్స్‌ మరింత ఫ్రెష్‌గా కనిపిస్తాయి. స్మాల్‌ కేఫేస్, ప్రశాంతమైన వీధులు, లేక్‌సైడ్‌ వాకింగ్‌ ΄ాథ్స్‌ అన్ని కంఫర్టబుల్‌ అట్మాస్పియర్‌ను క్రియేట్‌ చేస్తాయి. క్రౌడ్‌ తక్కువగా ఉండటం వల్ల నేచర్‌ని సులభంగా ఎంజాయ్‌ చేయవచ్చు.

సందర్శనీయ స్థలాలు
లేక్‌ వనాకా దగ్గర మార్నింగ్‌ వాక్‌ ప్రశాంతంగా అనిపిస్తుంది. రాయ్స్‌ పీక్‌ పరిసరాలు మిస్ట్‌తో ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రశాంతమైన వనాకా ట్రీ రెయినీ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్‌ ఫోటోగ్రాఫ్స్‌ తీయవచ్చు. అలాగే మౌంట్‌ అస్పైరింగ్‌ నేషనల్‌ ΄ార్క్‌ పరిసరాల్లోని గ్రీన్‌ ల్యాండ్‌స్కేప్స్‌ నేచర్‌ లవర్స్‌ని ఇంప్రెస్‌ చేస్తాయి.

వెరైటీ ఫుడ్‌ చాయిస్‌
ఫ్రెష్‌ సాల్మన్‌ డిషెస్‌ ఇక్కడ చాలా ΄ాపులర్‌. వార్మ్‌ పంప్‌కిన్‌ సూప్‌ను వర్షాలు పడుతున్న సమయంలో తీసుకుంటే ఆ మజానే వేరు. స్థానికంగా లభించే చీజ్‌ ΄్లాటర్స్, హాట్‌ కాఫీతో ఎంజాయ్‌ చేస్తే వాతావరణం ఇంకా మెమొరబుల్‌గా అనిపిస్తుంది.

ఎప్పుడు వెళ్లాలి?
జూన్‌ నుంచి ఆగస్ట్‌ వరకు వాతావరణం చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు కురిసే వర్షానికి వనాకా బ్యూటీ మరింత పెరుగుతుంది. లేక్‌ వ్యూస్‌ ప్రతి మూమెంట్‌ని రిఫ్రెషింగ్‌ మెమొరీగా మారుస్తాయి.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుంచి ఆక్లాండ్‌ లేదా క్వీన్స్‌ టౌన్‌ కి కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ లభిస్తాయి. క్వీన్స్‌ టౌన్‌ నుంచి రోడ్‌ జర్నీ ద్వారా వనాకాకు సుమారు 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫ్లైట్‌ కనెక్టివిటీ ఆధారంగా మొత్తం ప్రయాణానికి సుమారు 18 నుంచి 22 గంటల సమయం పడుతుంది.

  • వనాకా జర్నీ కంప్లీట్‌ అయ్యాక అక్కడి మెమొరీస్‌ సైలెంట్‌గా మనసులో రివైండ్‌ అవుతూ ఉంటాయి. వర్షం, పర్వతాలు, సరస్సులోని ప్రతిబింబాలు మనసును ప్రశాంతంగా మార్చేస్తాయి. ప్రకతిని స్లోగా ఎంజాయ్‌ చేయాలి అనుకునే వాళ్లకి ఈ డెస్టినేషన్‌ ఒక మరపురాని ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలి΄ోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement