స్విట్జర్లాండ్‌ టూర్‌ అన్న దంపతులు.. ఎక్కడ? | Chandrashekhar And Swapna Hyderabad Couple Case Regarding Their Switzerland Tour | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌ టూర్‌ అన్న దంపతులు.. ఎక్కడ?

Jul 11 2026 7:34 AM | Updated on Jul 11 2026 7:34 AM

Chandrashekhar And Swapna Hyderabad Couple Case Regarding Their Switzerland Tour

రూ.50కోట్ల అప్పులు..

హైదరాబాద్‌, కుషాయిగూడ: విదేశాలకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన దంపతులు అదృశ్యమయ్యారు. చర్లపల్లి ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపిన మేరకు.. చక్రిపురం, భగవాన్‌కాలనీలో నివసించే ఆల్‌ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్‌ ప్రదాన కార్యదర్శి, సిమెంట్‌ వ్యాపారి పబ్బ చంద్రశేఖర్, స్వప్న దంపతులు జూన్‌ 22న స్విట్జార్లాండ్‌ టూర్‌ వెళ్లి వస్తామని చెప్పి తమ కూతుళ్లను సోదరుడి ఇంట్లో ఉంచి వెళ్లారు. 

మరుసటి రోజు నుంచి ఇద్దరి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆందోళన చెందిన కూతుళ్లు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో కూతురు శ్రేయ చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా ఇప్పటికే పబ్బ చంద్రశేఖర్‌ 50 కోట్లు అప్పులు చేసి ఉడాయించాడంటూ ఆలిండియా ఆర్యవైశ్య ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌తో కలిసి బాధితులు జూన్‌ 31 సీపీ సుమతిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement