యూఏఈ భారత్‌కు ఎల్లప్పుడూ ప్రధాన భాగస్వామి అని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. యూఏఈ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు జరిపిన నేపథ్యంలో ఆ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా జైశంకర్ మట్లాడుతూ భారత్‌కు యూఏఈ ఒక అత్యంత ముఖ్యమైన మరియు నమ్మకమైన భాగస్వామన్నారు. రక్షణ, వాణిజ్యం మరియు ఇంధన రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత దృఢంగా ఉన్నాయని తెలిపారు. యూఏఈ అభివృద్ధిలో మరియు ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేయడంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.
టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ మరియు పెట్టుబడుల రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. అనంతరం యూఏఈ ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం మరియు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. కాగా ఇటీవల ఇరాన్ గల్ఫ్ దేశాలలలోని అెమెరికా స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నడుమ జైశంకర్ యూఏఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


