తెలంగాణ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ | Pm Narendra Modi Tweet On Visit To Telangana On May 10 | Sakshi
Sakshi News home page

తెలంగాణ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్

May 9 2026 9:30 PM | Updated on May 10 2026 12:09 PM

Pm Narendra Modi Tweet On Visit To Telangana On May 10

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేపు(మే 10, ఆదివారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార‍్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనపై ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘రేపు మే 10వ తేదీన కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటాను. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటాను. సమాజ సేవకు అంకితమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వివిధ రంగాల్లో అద్భుత కార్యక్రమాలు చేస్తోంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన.. రోడ్లు, లాజిస్టిక్స్, టెక్స్‌టైల్స్, రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ప్రధాన ప్రాజెక్టులు..

..సింధు హాస్పిటల్‌ను దేశానికి అంకితం చేస్తాను. సాయంత్రం హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తాను. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ తప్పుడు పాలనలతో విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీకి తెలంగాణ ప్రజల ఆదరణ పెరుగుతోంది’’ అంటూ ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement