Travel: 15,000 అడుగుల ఎత్తులో 'హోటల్‌ కాదు.. అడ్వెంచర్‌!' | Travel: Highlights Of The Margherita Hut Hotel Swiss-Italian Alps | Sakshi
Sakshi News home page

Travel: 15,000 అడుగుల ఎత్తులో 'హోటల్‌ కాదు.. అడ్వెంచర్‌!'

Jul 13 2026 9:26 AM | Updated on Jul 13 2026 9:30 AM

Travel: Highlights Of The Margherita Hut Hotel Swiss-Italian Alps

మార్ఘెరిటా హట్, ఇటలీ

ట్రెక్‌ చేస్తేనే చేరగలిగే హోటల్‌

రోడ్లు లేవు, వాహనాలు లేవు, ట్రెక్‌ చేస్తేనే చేరగలిగే హోటల్‌ 15,000 అడుగుల ఎత్తులో ఉంటే... ఆ హోటల్‌కి వెళ్లాలంటే 5 గంటలు ట్రెక్కింగ్‌ చేయాల్సిందే!

లగ్జరీ హోటల్స్‌ గురించి వినుంటారు. కానీ స్విట్జర్లాండ్‌–ఇటలీ సరిహద్దులో ఆల్ఫ్స్‌ పర్వతాల మధ్య సుమారు 15,000 అడుగుల (4,554 మీటర్లు) ఎత్తులో ఉన్న మార్గెరిటా హట్‌ మాత్రం పూర్తిగా భిన్నం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మౌంటైన్‌ హోటల్స్‌లలో ఒకటి. ఇక్కడికి వెళ్లేందుకు రోడ్డు లేదు, ఏ వాహనం కూడా వెళ్లలేదు. ట్రెక్కింగ్‌ చేస్తేనే ఇక్కడికి చేరుకోగలం. అది కూడా అందరూ కాదు.

5 గంటల ట్రెక్‌.. జీవితంలో మర్చిపోలేని అనుభూతి
మార్గెరిటా హట్‌ చేరడానికి ముందుగా గ్లేషియర్‌పై నడవాలి. సాధారణంగా పర్వతారోహకులు పుంటా గ్నిఫెట్టి అనేప్రాంతం నుండి గైడ్‌తో కలిసి సుమారు 5 గంటల ట్రెక్‌ చేస్తారు. మంచుతో నిండిన ఐస్‌ ఫీల్డులు, స్నో రిడ్జులు, హై ఆల్టిట్యూడ్‌ టెర్రెయిన్‌ లో సాగే ఈ జర్నీ అడ్వెంచర్‌ లవర్స్‌కి మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. దారి మధ్యలో ఆల్ఫ్స్‌ శిఖరాలు, ఎండ్‌లెస్‌ స్నో వ్యూస్‌ ప్రతి అడుగులో థ్రిల్‌ను పెంచుతాయి.

హోటల్‌ కాదు.. అడ్వెంచర్‌ బేస్‌ క్యాంప్‌ ఇది
ఇది రెగ్యులర్‌ లగ్జరీ హోటల్‌ కాదు. మౌంటైన్‌ క్లైంబర్స్, ట్రెక్కర్స్, పరిశోధకుల కోసం నిర్మించిన హై ఆల్టిట్యూడ్‌ రెఫ్యూజ్‌ ఇది. సాధారణమైన రూమ్లు, షేర్డ్‌ ఫెసిలిటీస్, వేడి వేడి భోజనం ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆల్పస్‌ మౌంటైన్‌ రేంజెస్‌ మీద పడే బంగారు వెలుగు చూడవచ్చు. ఆక్సిజన్‌ తక్కువగా ఉండటం వల్ల అక్లైమటైజేషన్‌ చాలా ముఖ్యం.

హైదరాబాద్‌ నుండి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుండి ముందుగా మిలాన్‌ లేదా జూరిచ్‌కు అంతర్జాతీయ విమానం ఎక్కాలి. అక్కడి నుండి రైలు లేదా కార్‌ ద్వారా అలాగ్నా వాల్సేసియా లేదా స్టాఫల్‌ చేరుకోవాలి. తరువాత కేబుల్‌ కార్‌ ద్వారా పుంటా ఇండ్రెన్‌ వరకు వెళ్లవచ్చు. అక్కడి నుండి సర్టిఫైడ్‌ మౌంటైన్‌ గైడ్‌తో ట్రెక్కింగ్‌ ప్రారంభం అవుతుంది. హై ఆల్టిట్యూడ్‌ ట్రెక్కింగ్‌ అనుభవం లేనివారు గైడ్‌ లేకుండా ప్రయాణించకూడదు.

ట్రావెల్‌ టిప్స్‌
జూన్‌ నుండి సెప్టెంబర్‌ మధ్య సీజన్‌ ట్రెక్కింగ్‌కు అనుకూలం. థర్మల్‌ వేర్, వాటర్‌ప్రూఫ్‌ జాకెట్, ట్రెక్కింగ్‌ బూట్స్, గ్లవ్స్, సన్‌ గ్లాసెస్, సన్‌ స్క్రీన్‌ తప్పనిసరి. వాతావరణం నిమిషాల్లో మారిపోతుంది. కాబట్టి సరైన ప్లానింగ్‌ అవసరం. మార్గెరిటా హట్‌ అనేది ఒక హోటల్‌ మాత్రమే కాదు. ప్రకృతి, సాహసం, మానవ సంకల్పం కలిసిన ఒక జీవితానుభవం. రోడ్డు లేకుండా, వాహనం లేకుండా మంచి డిటర్మినేషన్‌ తో చేరగలిగే ఈ మౌంటైన్‌ హట్‌ సాహసయాత్రికుల బకెట్‌ లిస్టులో తప్పకుండా ఉండాల్సిన డెస్టినేషన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement