అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం | Hyderabad Woman Dies Of Suspected Heart Attack During Trekking At Ananthagiri Hills Near Vikarabad | Sakshi
Sakshi News home page

అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం

Jul 13 2026 8:22 AM | Updated on Jul 13 2026 10:06 AM

Tragedy Strikes During Trekking In The Anantagiri Forest Area

ప్రైవేట్‌ టీచర్‌ మృతి 

అనంతగిరి: వికారాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన ట్రెక్కింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. వివరాలివి. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ డీఆర్‌డీఏ ప్రాంతానికి చెందిన ప్రియామోల్‌ (47) ప్రైవేట్‌ టీచర్‌. ఆమె కుటుంబీకులు, బంధువులతో కలిసి అనంతగిరి అర్బన్‌ పార్క్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

ట్రెక్కింగ్‌ మార్గంలోని వాచ్‌ టవర్‌ సమీపానికి చేరుకోగానే ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. గమనించిన కుటుంబీకులు అటవీ సిబ్బందితో ఆమెను వెంటనే వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ప్రాథమికంగా గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement