మా తాత పోలీస్‌... మీకేంటి? | Hyderabad Police Officer Booked For Allowing Six Year Old Granddaughter To Drive Car, Viral Video Sparks Outrage | Sakshi
Sakshi News home page

మా తాత పోలీస్‌... మీకేంటి?

Jul 13 2026 7:27 AM | Updated on Jul 13 2026 9:53 AM

SI Teaches Car Driving To 6 Year Old Girl

హైదరాబాద్‌: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అవగాహన కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి, మైనర్‌ (ఆరున్నరేళ్లు)  మనవరాలితో కారును నడిపించిన ఘటన రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ డివిజన్‌ గంధంగూడలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. గంధంగూడ– బైరాగిగూడ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. 

వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా ఓ కారు అస్తవ్యస్తంగా వెళ్తున్నట్లు వాహనదారులు గమనించారు. కారు వద్దకు వెళ్లి చూడగా డ్రైవింగ్‌ సీటులో ఓ బాలిక ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో కారును ఆపి బాలికతో డ్రైవింగ్‌ చేయించడం సరికాదని స్థానికులు సూచించారు. ఈ సందర్భంగా బాలిక ‘మా తాత పోలీస్‌... మీకేంటి? మమ్మల్ని ఆపడానికి మీరెవరు’? అంటూ మాట్లాడినట్లు వైరల్‌ అయిన వీడియోలో వినిపిస్తోంది. 

కారు పక్క సీటులో ఉన్న ఆ పోలీసు అధికారిని కూడా నిలదీయగా.. ఆయన దురుసుగా మాట్లాడారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించగా, ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. నార్సింగ్‌ పోలీసులు సుమోటాగా తీసుకుని బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 125, మోటారు వాహనాల చట్టం 180, 184 కింద కేసు నమోదు చేశారు. కాగా.. మనవరాలు తాత  పూజారి తిరుపతి నగరంలో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement