గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఉక్రెయిన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్ సాయం కోరే దేశం మాత్రమే కాదని ఇతరులకు సాయం శక్తి తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దుబాయిలో పర్యటనకు వెళ్లారు. ఖతార్‌తో 10 ఏళ్ల పాటు రక్షణ సహాకార ఒప్పందంపై ఆయన సంతకం చేశారు. ఇటీవలే గల్ఫ్ దేశాలకు సహాయంగా వెళ్లిన ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో యుఏఈ, ఉక్రెయిన్ ఉమ్మడి సహకారంతో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
కాగా ఈ పర్యటనలో జెలెన్‌స్కీతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు రక్షణ అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఇరాన్ తమ దేశంలోని ప్రజలు, సంపదనే లక్షంగా చేసుకొని దాడులు జరుపుతుందని యుఏఈ అధ్యక్షుడు ఆరోపించారు.
అయితే ఇటీవల ఇరాన్ దాడులను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై టెహ్రాన్ జెలెన్‌స్కీకి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్‌పై నేరుగా దాడి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన సాయం అందిస్తోంది.


