101 రకాల వంటకాల వద్ద మణికంఠ, గీతిక దంపతులు
గోదావరి జిల్లాల అంటే ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఆదివారం కడియం మండలం వేమగిరి తోటలో ఓ కొత్త అల్లుడికి పసందైన విందును ఏర్పాటు చేశారు. వేమగిరి తోటకు చెందిన నరాల గణపతి తన మనవరాలు (కొడుకు కుమార్తె) గీతికను, తన మనవడు (కూతురి కుమారుడు) మణికంఠకు ఇచ్చి వివాహం చేశారు. ఆ జంటకు 101 రకాల వంటకాలతో మణికంఠకు విందు భోజనం పెట్టారు.
-తూర్పుగోదావరి
చోటుమాటు కాదండోయ్..

నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా, తలకెక్కించుకోవడం లేదు. నిడదవోలు– నరసాపురం ఆర్‌అండ్‌బీ రహదారిపై 14 మంది మహిళలతో పెరవలి నుంచి తీపర్రు వైపునకు ఆటో ఇలా వెళ్లగా, వెనుక మహిళలు ప్రమాదకరంగా కూర్చున్నారు. ఉసులుమర్రు వద్ద అధిక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌పై, తీపర్రు వద్ద అరటి లోడు వ్యాన్‌పైన కూలీలు కూర్చుని వెళ్లడం కనిపించింది. ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చిన కొందరు భక్తులు ఆటోల వెనుక కూర్చుని ప్రమాదపు అంచున ప్రయాణం సాగించారు.
–పెరవలి , ద్వారకాతిరుమల


