కాకినాడలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి | Road Accident At Kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

May 16 2026 7:58 AM | Updated on May 16 2026 8:00 AM

Road Accident At Kakinada

సాక్షి, కాకినాడ: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలను టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్‌ కొవ్వూరు బ్రిడ్జి వద్ద టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి దగ్గర ఉపాధి పనుల కోసం వెళ్తున్న కూలీలపైకి టిప్పర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, మృతులను సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరంగా గుర్తించారు. వీరంతా చీడగ గ్రామానికి చెందినట్టు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement