‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’ | Former Mp Chinta Mohan Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’

May 6 2026 2:56 PM | Updated on May 6 2026 4:07 PM

Former Mp Chinta Mohan Fires On Chandrababu

సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు.‌ మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్‌ మండిపడ్డారు.

రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది..‌ చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ  చింతా  మోహన్‌ ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement