బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్‌.. కన్నబాబు ధ్వజం | YSRCP Leader Kurasala Slams AP Police Behaviour Over Timmapuram Sarpanch Illegal Arrest, More Details | Sakshi
Sakshi News home page

బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్‌.. కన్నబాబు ధ్వజం

Feb 12 2026 9:36 PM | Updated on Feb 13 2026 11:00 AM

YSRCP Leader Kurasala Slams AP Police Behaviour

కాకినాడ: వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌, తిమ్మాపురం సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్‌ను కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఖండించారు.  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

బెజవాడ సత్యనారాయణతో పాటు మరో పది మందిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని కురసాల తప్పుబట్టారు. తిమ్మాపురం శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, పోలీసులు మాత్రం వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసులు నమోదు చేయడాన్ని కురసాల తీవ్రంగా ఖండించారు. 

‘కొందరు పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు.  వైఎస్సార్‌సీపీకి కేసులంటే ఎలాంటి భయంలేదు. గత 18 నెలలుగా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ కొత్త సాంప్రదాయం మంచిది కాదు’ అని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement