సాక్షి, విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తున ఎసిగిపడనున్నాయని.. తీవ్ర తుపానుగానే తీరం దాటుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం కదులుతోంది. తీరంలో గాలుల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
సఖినేటిపల్లి-నర్సాపురం రాకపోకలు నిలిపివేత
అంబేద్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సఖినేటిపల్లి -నర్సాపురం రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ రోజు నుండి తుపాను ఉధృతి తగ్గే వరకు రేవులో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తీర ప్రాంతాల్లో అలర్ట్..
మొంథా తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతాలను కృష్ణా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. మచిపలీట్నంలోని మంగినపూడి బీచ్, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద హంసల దీవి బీచ్‌లను మూసివేశారు. మంగినపూడి బీచ్‌లో జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ, మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులను బీచ్‌లోకి రాకుండా పికెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.



