kakinada coast
-
కాకినాడ తీరం... విస్తరిస్తున్న పారిశ్రామికం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ తీరం కళ్లు మిరుమిట్లు గొలిపే పారిశ్రామిక ప్రగతి వైపు దూసుకెళ్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్ఈజెడ్) ఏర్పాటై దశాబ్ద కాలం గడచినా చంద్రబాబు పాలనలో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్తా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆయన హయాంలో సెజ్ భూముల బదలాయింపులు తప్ప తదనంతర ప్రగతి కనిపించ లేదు.అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గడచిన రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఈ ఏడాది అంతానికి పట్టాలెక్కేలా ప్రణాళికతో నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉండి సముద్ర తీరానికి ఆనుకుని సుమారు ఏడువేల ఎకరాలను అన్ని అనుమతులతో సెజ్ కోసం సిద్ధం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సరళీకరణ పారిశ్రామిక విధానాలు దోహదం చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ‘పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్’ నిర్మాణం తొండంగి మండలంలో అరబిందో ఫార్మా దేశంలోనే అతి పెద్ద పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 416 ఎకరాలు కేటాయించింది. అరబిందో ఫార్మా అనుబంధ లీఫియస్ ఫార్మా ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పెన్సిలి జీ డిసెంబర్ నెలాఖరు నాటికి ట్రయల్‌రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. రూ.2,000 కోట్ల వ్యయంతో 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటువుతున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకోనుంది. పీఎల్‌ఐఎస్ పథకం ద్వారా దేశంలో ఎంపికైన తొలి ప్రాజెక్టు లీఫియస్ ఫార్మా పెన్సిలిన్ జీ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 4,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. చురుగ్గా మేజర్ హార్బర్ నిర్మాణ పనులు ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో ఇచి్చన హామీ మేరకు రూ.350 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికే 70 శా తం పూర్తి అయింది. ఏకకాలంలో 2,500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 50 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలిగేలా, లక్ష టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.రూ.2,500 కోట్లతో కాకినాడ గేట్ వే పోర్టు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం సెజ్‌లో 1,650 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డీప్ సీ పోర్టుగా 11 బెర్తుల సామర్థ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పోర్టు ద్వారా 16 మిలియన్ టన్నుల కార్గోను ఏటా హ్యాండ్లింగ్ చేసే అవకాశం లభిస్తుంది. 2.70 లక్షల టన్నుల బరువును మోయగల భారీ ఓడలు నిలుపుకునేలా పోర్టు నిర్మాణం జరుగుతోంది. పోర్టు కోసం అన్నవరం నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించింది. యాంకరేజ్ పోర్టులో అంతర్గత రహదారులు, జట్టీల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. -
కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. కోస్ట్ గార్డ్ ఆపరేషన్‌తో 11 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్ సిబ్బంది కాపాడారు. -
కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారుల మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందారు. సోమవారం రాత్రి సూర్యారావుపేట నుంచి హోప్ ఐల్యాండ్ వరకు అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేటక ముగించుకొని తిరిగి వస్తుండగా కెరటాల ధాటికి తెప్ప తిరగడింది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు దుమ్మలపేటకు చెందిన మైలపల్లి కృపాదాస్, సూర్యరావుపేటకు చెందిన సత్తిరాజుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తెప్ప తిరగబడి సముద్రంలో పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన విషయాన్ని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల మృతి విషయాన్ని తెలుసుకున్న సీఎం చలించిపోయి వెంటనే ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. -
వాయు'గండం'
సాక్షి, నెట్వర్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 11.30 గంటలకు తీవ్ర వాయుగుండంగా మారింది. రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 220 కి.మీ, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 240 కి.మీ, నర్సాపురానికి తూర్పు ఆగ్నేయ దిశగా 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిమీ వేగంతో ప్రయాణం చేస్తూ కాకినాడకు అతి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఆ సమయంలో కోస్తాంధ్రలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని తాకవచ్చని తెలిపింది. దీని ప్రభావంవల్ల మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. అందువల్ల మంగళవారం మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. పలు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. కొనసాగుతున్న వర్షాలు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. కాకినాడ తీరంలో సోమవారం రాత్రి నుంచి గాలులు మొదలయ్యాయి. వర్షం కూడా పెరిగింది. కోనసీమలో అధికారులు ముందస్తుగా 41 తుపాను షెల్టర్లలో పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకినాడ– ఉప్పాడ బీచ్ రోడ్డు పలుచోట్ల కోతకు గురయ్యింది. ప్రభుత్వ హెచ్చరికలతో మత్స్యకారులు వేటను నిలిపేశారు. కాకినాడలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 350 మందిని తరలించారు. సురక్షిత ప్రాంతాలకు నౌకలు కాకినాడ యాంకరేజ్ పోర్టు, డీప్ వాటరు పోర్టుల్లో ఎగుమతి, దిగుమతి పనులు నిలిచిపోయాయి. ఏపీ మెరైన్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు యాంకరేజ్ పోర్టులో ఉన్న 13 అంతర్జాతీయ నౌకలను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిపేసినట్లు పోర్టు అధికారి జి.వీరరాఘవరావు తెలిపారు. డీప్ వాటర్ పోర్టు (కాకినాడ సీ పోర్టు)లో చక్కెర, ఎరువుల ఎగుమతి, దిగుమతుల్ని నిలిపేసినట్లు సీపోర్టు అధికారి మురళీధర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదీ తీరప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో లంకలు, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. విశాఖపట్నం జిల్లాలో భారీవర్షం కురిసింది. విజయనగరం, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అల్పపీడనం, వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలు ఎనిమిది జిల్లాల్లో సుమారు 12,473 హెక్టార్లలో పంటలపై ప్రభావం చూపినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 17 సెంమీ, విశాఖపట్నం 15, కాకినాడ, పెద్దాపురంలో 14, యానాంలో 11, అనకాపల్లి, అమలాపురంలో 10, మర్రిపూడి, తునిలో 8, సింహాద్రిపురం, ప్రత్తిపాడు, యలమంచిలిలో 7 సెంమీ, చీమకుర్తి, నర్సీపట్నం, చోడవరం, ఒంగోలు, పాలకోడేరులో 5 సెంమీ వర్షపాతం నమోదైంది. అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ భారీ వర్షాల వల్ల అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రజలకు తక్షణం సేవలందించేందుకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలోని పోలీసులను డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఈ విషయమై సోమవారం రాత్రి ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌వోల) నుంచి జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమీషనర్ల వరకు 24 గంటలూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు డయల్ 100, డయల్ 112కు సమాచారం ఇచ్చి పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. -
కాకినాడ తీరంలో చమురు దొంగలు
-
కాకినాడ తీరంలో ‘విరాట్ ’
కాకినాడ సిటీ: భారత నావికాదళానికి చెందిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ శనివారం కాకినాడ తీరంలో లంగరేసింది. ఈ నెల 4 నుంచి 8 వరకూ విశాఖ తీరంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న విరాట్ ముంబై తిరిగి వెళుతోంది. ఆ క్రమంలో నౌకను కాకినాడ డీప్ వాటర్పోర్టుకు కొద్ది దూరంలో నిలిపారు. అయితే నౌకను సందర్శించే అవకాశాన్ని కేవలం పోర్టు, నేవీ, ఇతర అధికారులకే పరిమితం చేసి, బయటి వారిని అనుమతించ లేదు. 57 ఏళ్ళపాటు అటు బ్రిటన్, ఇటు భారత నావికాదళాల్లో సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన యుద్ధనౌకగా విరాట్ గుర్తింపు పొందింది. 1959 నుంచి సుమారు 27 ఏళ్ళు బ్రిటిష్ నేవీలో సేవలందించిన ఈ నౌకను 1986లో భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొద్ది మరమ్మతులతో 1987నుంచి ఈ నౌక ఐఎన్ఎస్ విరాట్ పేరుతో భారత నావికాదళంలో అతిపెద్ద, ఏకైక విమానవాహక యుద్ధనౌకగా నడుస్తోంది. అయితే విరాట్ భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో త్వరలో విశాఖ తీరంలో షిప్ మ్యూజియంగా ఏర్పాటుచేయనున్నారు. -
కాకినాడ సెంట్రల్ జైలుకు 36 మంది శ్రీలంక జాలర్లు
కాకినాడ : రెండు రోజుల క్రితం భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన 36 మంది శ్రీలంక జాలర్లను ఆదివారం కాకినాడ సెంట్రల్ జైలుకు తరలించారు. శుక్రవారం మచిలీపట్న సమీపంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్న తీరప్రాంతమైన గిలకలిదిండిలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీలంక జాలర్ల వద్ద నుంచి 4 టన్నుల టునా చేపలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆరు బోట్లను సీజ్ చేశారు. పది రోజుల క్రితమే ఇక్కడకు ప్రవేశించినట్లు వారు పోలీసులకు తెలిపారు. శ్రీలంక జాలర్లు ఇలా తరుచు భారతీయ జలాల్లోకి రావడానికి కారణం ఇక్కడ దొరికే టునా చేపలను కోసమేనని పోలీసులు తెలిపారు. దీనికి ఐస్ లాండ్ దేశంలో భారీ గిరాకీ ఉంటుందన్నారు. -
కాకినాడ తీరంలో 31 మంది శ్రీలంక జాలర్లు అరెస్ట్
భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన 31 మంది శ్రీలంక జాలర్లను శుక్రవారం కాకినాడ సమీపంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీలంక జాలర్ల వద్ద నుంచి 4 టన్నుల టునా చేపలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆరు బోట్లను సీజ్ చేశారు. శ్రీలంక జాలర్లపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.