కాకినాడ సెంట్రల్ జైలుకు 36 మంది శ్రీలంక జాలర్లు | 36 Sri Lankan fishermen shifted to Kakinada jail | Sakshi
Sakshi News home page

కాకినాడ సెంట్రల్ జైలుకు 34 మంది శ్రీలంక జాలర్లు

May 11 2014 8:55 PM | Updated on Nov 9 2018 6:39 PM

భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన 36 మంది శ్రీలంక జాలర్లను ఆదివారం కాకినాడ సెంట్రల్ జైలుకు తరలించారు.

కాకినాడ : రెండు రోజుల క్రితం భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన 36 మంది శ్రీలంక జాలర్లను ఆదివారం కాకినాడ సెంట్రల్ జైలుకు తరలించారు. శుక్రవారం మచిలీపట్న సమీపంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్న తీరప్రాంతమైన గిలకలిదిండిలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీలంక జాలర్ల వద్ద నుంచి 4 టన్నుల టునా చేపలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆరు బోట్లను సీజ్ చేశారు. పది రోజుల క్రితమే ఇక్కడకు ప్రవేశించినట్లు వారు పోలీసులకు తెలిపారు.

 

శ్రీలంక జాలర్లు ఇలా తరుచు భారతీయ జలాల్లోకి రావడానికి కారణం ఇక్కడ దొరికే టునా చేపలను కోసమేనని పోలీసులు తెలిపారు. దీనికి ఐస్ లాండ్ దేశంలో భారీ గిరాకీ ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement