
సాక్షి,కాకినాడ: తునిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవ పడి..ట్రైన్ ఎక్కేందుకు వెళ్తున్న తండ్రీ కొడుకును మరో రైలు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. పాయకరావుపేటకు చెందిన అనీల్ తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్యపై అలిగి తన స్వస్థలమైన గుంటూరు వెళ్లేందుకు కుమారుడితో కలిసి తుని రైల్వేస్టేషన్‌కు బయల్దేరాడు.
పట్టాలపై నుంచి స్టేషన్‌కు వచ్చే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రైన్ వారిద్దరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో కుమారుడి మృతదేహాన్ని పాయకరావుపేట-తునికి మధ్యలో ఉన్న తాండవ వంతెనపైన..తండ్రి మృతదేహాన్ని తాండవ నదిలో తుని రైల్వే పోలీసులు గుర్తించారు. కుమారుడిపేరు గుణశేఖర్.
మరోవైపు,భర్త,కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడం అనిల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లయింట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తుని రైల్వే పోలీసులు,పాయకరావు పేట పోలీసులు సంయుక్తంగా తాండవ వంతెనపై జరిగిన ప్రమాదంలో తండ్రి అనీల్, కుమారుడు గుణ శేఖర్‌ల మృతదేహాలను గుర్తించారు.