కాకినాడలో గంజాయి బ్యాచ్‌ రచ్చ.. రికార్డింగ్ డ్యాన్సర్లతో హల్‌చల్‌ | Youth Hulchul At Kakinada Peddapuram Maridamma Jatara, More Details Inside| Sakshi
Sakshi News home page

కాకినాడలో గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌.. రికార్డింగ్ డ్యాన్స్ వేళ కొట్లాట

Jun 30 2025 8:51 AM | Updated on Jun 30 2025 10:27 AM

Youth Hulchul At Kakinada Jatara

సాక్షి, కాకినాడ: కాకినాడలోని పెద్దాపురం మరిడమ్మ జాతరలో యువకుల వీరంగం సృష్టించారు. జాతర సందర్బంగా అక్కడ రికార్డింగ్‌ డ్యాన్స్‌లు, అశ్లీల నృత్యాలు జరిగాయి. ఈ క్రమంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు హల్‌చల్‌ చేశారు. అనంతరం, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. కాకినాడలో గంజాయి బ్యాచ్‌ హల్‌ చల్‌ చేసింది. జాతర సందర్భంగా దర్గా సెంటర్‌లో రికార్డింగ్ డ్యాన్స్, అశ్లీల నృత్యాలతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నృత్యాలు చూసి కొందరు యువకులు రెచ్చిపోయారు. గంజాయి, మద్యం మత్తులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రక్తం వచ్చేలా ఇరువర్గాలు తన్నుకున్నారు. దీంతో​, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సదరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement