కాకినాడ తీరప్రాంతం మాటున దాగిన కోరంగి వన్యప్రాణి అభయారణ్యం
కోరంగి వన్యప్రాణి అభయారణ్యం సందర్శకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది
ఈ కోరంగి వన్యప్రాణి అభయారణ్యం కాకినాడ జిల్లా, తాళ్ళరేవు మండలానికి చెందిన గ్రామం.ఈ గ్రామం కాకినాడ నుండి 15 కి.మీల దూరంలో ఉంది
దేశంలో ఉన్న అతి పెద్ద అడవుల్లో మూడవ అతి పెద్ద అడవి కోరంగి వన్యప్రాణి అభయారణ్యం. కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి
ఇక్కడ ఉన్న వాచ్ టవర్ పైనుండి అడవి అందాలను వీక్షించవచ్చు
బ్యాక్ వాటర్స్ లో సముద్రం కలిసే చోటు వరకూ బోటు షికార్ చెయ్యవచ్చు.
బ్రిటీష్ వాళ్ళ కాలంలో నిర్మించిన పురాతన లైట్ హౌస్ చూసి రావడానికి ప్రత్యేకంగా ప్యాకేజ్ టూర్ కూడా నిర్వహిస్తున్నారు
వర్షాకాలం వెళ్ళిన తరువాత అక్టోబరు నుంచి మే వరకు కోరింగ అభయారణ్యాన్ని సందర్శించడానికి అనువైన సమయం
నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు వలస పక్షులను చూడవచ్చు
ఇక్కడ బోట్ రైడింగ్ కు చాలా ప్రత్యేకత ఉంది. కోరింగ అభయారణ్యాల అందమంతా ఈ ప్రదేశంలోనే ఉంటుంది
రైలు మార్గం : కాకినాడ రైల్వేస్టేషను నుండి 10 కి.మీ., రాజమండ్రి రైల్వే స్టేషను నుండి 70 కి.మీ.
రోడ్డు మార్గం: కాకినాడ పట్టణం నుండి కోరింగ అభయారణ్యాలకు బస్సులు, ఆటోలు, ప్రైవేట్ టాక్సీలు ఉంటాయి. బస్సులు అయితే కోరంగి అభయారణ్య జంక్షన్ దగ్గరే ఆగిపోతాయి.


