‘అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’ | AP Govt Should support farmers Dadisetti Raja Demands | Sakshi
Sakshi News home page

‘అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’

May 4 2025 3:18 PM | Updated on May 4 2025 4:32 PM

AP Govt Should support farmers Dadisetti Raja Demands

కాకినాడ:  ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. తొండంగి మండలం కోదాడలో దాడిశెట్టి రాజా పర్యటించి.. రైతుల పొలాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ‘తడిచిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయ్యాలి. 

రైతులను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వం చీకటీ ప్రభుత్వమే?, తడిన ధాన్యాన్ని మద్దత్తు ధర తో వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగొలు చేసింది. రూ.1,800 - 2,000 మద్దత్తు ధర చెల్లించి ఆఖరి గింజ వరకు సేకరించారు.ఏ సీజన్ లో పంట నష్టపోతే..అదే సీజన్ లో రైతులకు వైఎస్ జగన్ నష్టపరిహారం చెల్లించారు. 

కూటమీ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఇవాళ రూ.1,250 లు చెల్లించి దళారులు రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కూటమి పాలన ఓ చీకటి. దేవాలయంకు వెళ్ళాలన్నా భక్తులు భయపడుతున్నారు. సింహచలం దుర్ఘటన తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వం తప్పించుకుంది
కనీసం భాధిత కుటుంబాలను పరామర్శించే బాధ్యత సీఎం చంద్రబాబుకు ఉంది’ అని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement