కీచకుడిపై చట్టపరమైన చర్యలు | kakinada collector orders action in minors abuse cases | Sakshi
Sakshi News home page

కీచకుడిపై చట్టపరమైన చర్యలు

Jul 21 2026 1:03 PM | Updated on Jul 21 2026 1:09 PM

kakinada collector orders action in minors abuse cases

కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్‌ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. 

జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు.

 మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్‌కు నోట్‌ఫైల్‌ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్‌కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్‌ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.    

భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement