
ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెద మల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో భార్యాభర్తలపై ఓ వ్యక్తి నాటు తుపాకితో కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కాకర చంద్రబాబు, కుమారి భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లులు ఉన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఓకుర్తి గ్రామానికి చెందిన ముళ్ల మణికంఠకు, కుమారికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ఓకుర్తిలో సహజీవనం చేశారు. పెద్దల సమక్షంలో చర్చల అనంతరం కుమారి పది రోజుల కిందట భర్త, పిల్లల వద్దకు చేరుకుంది. మణికంఠ ఆదివారం అర్ధరాత్రి నాటు తుపాకితో శృంగధార గ్రామంలోని చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించాడు. భార్యాభర్తలపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో చంద్రబాబు, కుమారి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.