breaking news
Indore man
-
రెండుసార్లు జేఈఈ ఫెయిల్..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు
సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కళశాల డ్రిగీలు అవసరం లేదు. అందుకు నిదర్శనం ఈ వ్యక్తి. అతడి గురించి సోషల్ మీడియా వేదిక అంకుర్ వారికూ పంచుకున్నారు. ఫ్రీలాన్సింగ్ చేస్తూ విజయవంతంగా కెరీర్‌ని నిర్మించుకున్న వ్యక్తి సక్సెస్ జర్నీని పంచుకుంటూ..ప్రతిభ ఉంటే సరిపోదు దాన్ని సరైన విధంగా ఉపయోగించుకునే తెలివితేటలు ఉండాలన్నారు. డిగ్రీలుంటే పెద్ద పెద్ద ఉగ్యోగాలు రావని, నైపుణ్యం, అవకాశాలను సృష్టించుకునే సామర్థ్యం ఉంటేనే విజయం దక్కుతుందంటూ ఈ వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు పోస్ట్‌లో ఇలా. అంకుర్ పోస్ట్‌లో ఇండోర్‌కి చెందిన వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. అతడు రెండుసార్లు జేఈఈ ఫెయిల్ అయ్యాడు. కానీ అతను రాత్రిపూట యూట్యూబ్‌లో స్వయంగా ప్రొడక్ట్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. దాని సాయంతో ఫ్రీలాన్సింగ్ చేస్తూ నెలకు రెండు లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ గ్రాడ్యుయేట్లు సైతం సిగ్గుపడేలా తన కెరీర్‌ని నిర్మించుకున్నాడని అన్నారు. భారతదేశంలో ప్రతిభకు కొదువ లేదు దాన్ని ఉపయోగించుకుని టాలెంట్‌ని ప్రదర్శించడంలోనే ఇబ్బంది పడుతున్నారని అన్నారు చివరగా ఆ వ్యక్తి పేరు నమన్ అంటూ తన పోస్ట్‌ని ముగించారు. నెటిజన్లు కూడా అంకుర్ మాటలకు మద్దతిస్తూ..పట్టభద్రులైన ప్రతిఒక్కరూ అధిక జీతాలు సంపాదించలేరని అన్నారు. నిస్సందేహంగా స్వయంగా నేర్చుకుని డబ్బు సంపాదించేవారు కచ్చితంగా అత్యంత తెలివైన వారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo) (చదవండి: ఈ వంటకం బర్గర్‌కి మించి టేస్టీ..!: హర్ష్ గోయెంక) -
భార్య నుంచి పారిపోవడానికి భర్త మాస్టర్ ప్లాన్!
భోపాల్: దేశంలో కరోనా సృష్టించిన విధ్వంసం మనందరికి తెలిసిందే. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, కరోనా సోకిన వ్యక్తి, 14 రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ సమయంలో వారితో ఎవరు కలవకుండా, సామాజిక దూరం పాటించాలన్న విషయం తెలిసిందే. అయితే, కొందరు ఈ నిబంధనను తమ వ్యక్తిగత విషయాల కోసం దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇండోర్‌లోని మోవ్ అనే ప్రాంతంలో 26 ఏళ్ల వ్యక్తికి గడిచిన ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అతనికి భార్య, ఇంట్లోవారితో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎలాగైle ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాడు. కాగా, దీనికోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఒక ప్రైవేటు ల్యాబ్ నుంచి కోవిడ్ సోకిన వ్యక్తి రిపోర్ట్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. దానిపై అతని పేరును మార్చి, తన పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత , ఆ రిపోర్ట్‌ను తన భార్య, తల్లిదండ్రులకు వాట్సప్ చేశాడు. అయితే, కుటుంబ సభ్యులు,ఈ వాట్సప్ చూసి షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అతనికి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. దీంతో, వారికి తమ కుమారుని ప్రవర్తనపై అనుమానం కలిగింది. వారు వెంటనే ఆ వాట్సప్‌లో ఉన్న ప్రైవేటు ల్యాబ్‌ను వెళ్లి సంప్రదించారు. అప్పుడు వారికి తమ కొడుకు చేసిన మోసం బయటపడింది. దీంతో, ఆశ్చర్యపోయి, వారు ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆ ల్యాబ్ టెక్నిషియన్ మాత్రం, తమ ల్యాబ్ రిపోర్ట్‌ను ఫోర్జరీతో మార్పిడి చేసినందుకుగాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గ్వల్టోలి పోలీసులు నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదుచేశారు. -
మీకు డ్రైవింగ్ రాదా.. ఈయన గురించి తెలుసుకోండి!
దేశంలో ప్రతిరోజూ చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ పరీక్షల్లో పాసై లైసెన్స్ కూడా పొందుతారు. కొంతమంది మాత్రం డ్రైవింగ్ నేర్చుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. అలాంటి వారికి 45 ఏళ్ల అగ్నిహోత్రి స్ఫూర్తి అని చెప్పవచ్చు. దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అరుదైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రెండు చేతులూ లేకపోయినా కాళ్లతో వాహనాన్ని నడుపుతూ ఆయన తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. కాళ్లతో నడుపుతూ లైసెన్స్ పొందిన దేశంలోని దాదాపు మొదటి వ్యక్తిగా అగ్నిహోత్రి ఘనత సొంతం చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన అగ్నిహోత్రి సకంల్పానికి వైకల్యం అడ్డుకాదని చాటారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చే వక్త అయిన ఆయన.. ప్రస్తుతం ఎల్ఎల్బీ చేస్తున్నారు. సొంతంగా ఓ గ్యాస్ ఏజెన్సీని నడుపుతున్నారు. ఆయన వాహనాన్ని నడిపేందుకు గతంలో డ్రైవర్ ఉండేవారు. కానీ, ప్రాథమిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదనేది ఆయన పాలసీ. అందుకే మొక్కవోని సంకల్పంతో రెండు చేతులూ లేకున్నా డ్రైవింగ్ నేర్చుకున్నారు. చేతులు లేకున్నా ఆయన డ్రైవింగ్ ఎలా చేస్తారనేది కొంతమందికి సందేహం రావొచ్చు. కానీ ఆయన కుడికాలితో స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ.. ఎడుమ కాలితో ఆక్సిలరేటర్ను ఉపయోగిస్తూ.. ఆటోమేటిక్ గేరు కారును నడుపుతారు. అగ్నిహోత్రి డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తును రవాణాశాఖ పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తనకు అనుగుణంగా ఉండేవిధంగా కారును రూపొందించుకొని.. డ్రైవింగ్ టెస్టుల్లో దానిని విజయవంతంగా నడిపి.. అగ్నిహోత్రి ఈ ఘనత సాధించారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి వరుసగా వినతిపత్రాలు ఇస్తూ పోయిన ఆయన.. ఎట్టకేలకు సెప్టెంబర్ 30వ తేదీన శాశ్వత లైసెన్స్ సాధించారు. రోడ్డు మీద ఎంతోమంది ఇప్పటికే వాహనాలు నడిపించడానికి నానా తంటాలు పడుతుంటారు. కానీ, అగ్నిహోత్రి మాత్రం రెండు చేతులూ లేకపోయినా ఇప్పటివరకు 14,500 కి.మీ దూరాన్ని ఎలాంటి విజయవంతంగా ఎలాంటి ప్రమాదాలు చేయకుండా నడిపారు. త్వరలో జమ్ముకశ్మీర్‌లోని లెహ్ వరకు తానే వాహనాన్ని నడుపుతూ వెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.


