హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో... | India will compete in the mens Pro Hockey League | Sakshi
Sakshi News home page

హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో...

Feb 6 2026 4:01 AM | Updated on Feb 6 2026 4:01 AM

India will compete in the mens Pro Hockey League

పురుషుల ప్రొ హాకీ లీగ్‌ బరిలో భారత్‌

న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న పురుషుల ప్రొ హాకీ లీగ్‌ తొలి అంచెలో పాల్గొనే భారత హాకీ జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వం వహిస్తాడు. ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకు రౌర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. 

అర్జెంటీనా, బెల్జియం జట్లతో భారత్‌ రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఫిబ్రవరి 11న బెల్జియంతో... 12న అర్జెంటీనాతో పోటీపడే భారత్‌... ఫిబ్రవరి 14న అర్జెంటీనాతో... 15న బెల్జియంతో మళ్లీ ఆడుతుంది. తొలి అంచె తర్వాత భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. ఫిబ్రవరి 21న, 24న స్పెయిన్‌తో ఆడే భారత్‌... ఫిబ్రవరి 22, 25న ఆ్రస్టేలియాను ‘ఢీ’ కొంటుంది. గత సీజన్‌లో భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది 

భారత హాకీ జట్టు: సూరజ్‌ కర్కేరా, పవన్‌ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెపె్టన్‌), అమిత్‌ రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, జుగ్‌రాజ్‌ సింగ్, సుమిత్, సంజయ్, నీలం సంజీప్‌ జెస్, అమన్‌దీప్‌ లాక్రా (డిఫెండర్లు), రాజిందర్‌ సింగ్, మన్‌మీత్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, హార్దిక్‌ సింగ్, మొయిరాంగ్తెమ్‌ రబిచంద్ర సింగ్, నీలకంఠ శర్మ, రోషన్‌ కుజుర్‌ (మిడ్‌ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్‌జీత్, శిలానంద్‌ లాక్రా, సెల్వం కార్తీ, మన్‌దీప్‌ సింగ్, అరిజిత్‌ సింగ్‌ హుండల్, ఆదిత్య అర్జున్‌ లలాగే (ఫార్వర్డ్స్‌). 

Advertisement
 
Advertisement
Advertisement