
హాకీ ఆసియా కప్ సెమీఫైనల్‌లో భారత్ అదరగొట్టింది. బీహార్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో చైనాపై 7-0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ఇక దీంతో 9 సార్లు ఆసియా కప్ ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ రేపు (ఆదివారం) సౌత్ కొరియాలో జరగనుంది. తుది పోరులో గెలిచిన జట్టు 2026 FIH హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది.