అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి, ప్రపంచ 481వ ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత రెండో ర్యాంకర్ రష్మిక 6–1, 6–1తో అరుజాన్ (కజకిస్తాన్)పై గెలిచింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
ఫస్ట్ సర్వ్‌లో 19 పాయింట్లు, సెకండ్ సర్వ్‌లో 7 పాయింట్లు సాధించింది. ప్రత్యర్థిసర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన రష్మిక తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. డబుల్స్ విభాగంలో రష్మిక–వైదేహి (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–0తో లుండా కుమ్‌హోమ్–టానుచపోర్న్ యోంగ్‌మోడ్ (థాయ్‌లాండ్) ద్వయంపై విజయం సాధించింది.


