విరాట్ కోహ్లిది ఔటా? నాటౌటా? వీడియో వైరల్‌ | Virat Kohli Out Or Not Out? Major DRS Controversy Erupts In Ind vs SL | Sakshi
Sakshi News home page

Ind vs SL 2nd Odi: విరాట్ కోహ్లిది ఔటా? నాటౌటా? వీడియో వైరల్‌

Aug 5 2024 12:59 PM | Updated on Aug 5 2024 4:23 PM

Virat Kohli Out Or Not Out? Major DRS Controversy Erupts In Ind vs SL

ఆదివారం కొలంబో వేదికగా భార‌త్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 32 ప‌రుగుల తేడాతో శ్రీలంక అద్భుత విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో థ‌ర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణ‌యం వివాద‌స్ప‌ద‌మైంది. భార‌త ఇన్నింగ్స్ 15ఓవర్ వేసిన స్పిన్న‌ర్ అకిల ద‌నంజ‌య బౌలింగ్‌లో ఆఖ‌రి బంతిని విరాట్ కోహ్లి డిఫెన్స్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు.

ఈ క్ర‌మంలో బంతి బ్యాట్‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్తూ విరాట్‌కు ఫ్రంట్ ప్యాడ్‌కు తాకింది. వెంట‌నే లంక ఆట‌గాళ్లు ఎల్బీడ‌బ్ల్యూకి అప్పీల్‌ చేశారు. అంపైర్‌ కూడా వెంటనే ఔట్‌ అని వేలు పైకెత్తాడు. కానీ కోహ్లి మాత్రం నాన్‌స్ట్రైక్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌తో చర్చించి డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. అయితే ఈ రివ్యూ థర్డ్‌ అంపైర్‌కు బిగ్‌ ఛాలెంజ్‌గా మారింది. 

రిప్లేలో బంతి విరాట్‌ బ్యాట్‌ను దాటి వెళ్లి ప్యాడ్‌ను తాకేముందు అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ చూపించింది. కానీ బిగ్‌ స్క్రీన్‌లో మాత్రం బ్యాట్‌కు, బంతికి క్లియర్‌ గ్యాప్‌ ఉన్నట్లు కన్పించింది. ఆఖరికి థర్డ్ అంపైర్ కోహ్లికి ఫేవర్‌గా నాటౌట్ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 

ఇది చూసిన శ్రీలంక ఫీల్డర్లు కోపంతో ఊగిపోయారు. లంక తాత్కాలిక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య సైతం ఆసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అయితే తన హెల్మెట్‌ను  నెలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: IND vs SL: వాషీని కొట్టడానికి వచ్చిన రోహిత్ శర్మ!?.. వీడియో వైరల్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement