కొలొంబోకు చేరుకున్న భారత వన్డే ప్లేయర్లు | Rohit And Co Arrive In Colombo Ahead Of ODI Series, Nayar Deputed To Oversee Nets | Sakshi
Sakshi News home page

కొలొంబోకు చేరుకున్న భారత వన్డే ప్లేయర్లు

Jul 29 2024 1:52 PM | Updated on Jul 29 2024 2:56 PM

Rohit And Co Arrive In Colombo Ahead Of ODI Series, Nayar Deputed To Oversee Nets

శ్రీలంకతో వన్డే సిరీస్‌కు మాత్రమే ఎంపికైన భారత ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా ఆదివారం రాత్రి కొలొంబోకు చేరుకున్నారు. వీరికి కొలొంబోలోని ఐటీసీ రత్నదీప హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు. ఇవాళ (జులై 29) సాయంత్రం నుంచి భారత క్రికెటర్లు నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ బాధ్యతలను భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌కు అప్పజెప్పింది. 

ఇవాళ ఉదయం నాయర్‌ కొలొంబోలో భారత వన్డే జట్టుతో కలిశాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు పల్లెకెలెలో ఉంది. లంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నెల 30న జరిగే మూడో టీ20 అనంతరం టీ20 జట్టులో ఉన్న వన్డే జట్టు సభ్యులు రోహిత్‌ అండ్‌ కోను కలుస్తారు. ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో టీమిండియా.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతుంది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టీ20 వరల్డ్‌కప్‌ 2024 అనంతరం టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం​ భారత జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, శివమ్‌ దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, రియాన్‌ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, హర్షిత్‌ రాణా

 

Advertisement
 
Advertisement
Advertisement