టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్లు ఇవే | IND Vs SL: Sri Lanka Opt To Bat Against India In 2nd ODI, Check Out Final Playing XI | Sakshi
Sakshi News home page

IND vs SL 2nd Odi: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. తుది జట్లు ఇవే

Aug 4 2024 2:18 PM | Updated on Aug 4 2024 3:16 PM

Sri Lanka Opt To Bat Against India ind 2nd Odi

కొలంబో వేదిక‌గా శ్రీలంక‌-భార‌త్ జ‌ట్లు రెండో వ‌న్డేలో త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా దూరం కాగా.. పేసర్ షిరాజ్‌ను శ్రీలంక మెనెజ్‌మెంట్ పక్కన పెట్టింది. 

వీరిద్దరి స్ధానాల్లో జెఫ్రీ వాండర్సే, క‌మిందు మెండీస్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు. మ‌రోవైపు భార‌త్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. కాగా ఇదే వేదిక‌లో ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డే టై గా ముగిసింది.

తుది జట్లు
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్‌), కమిందు మెండిస్, జనిత్ లియానగే, దునిత్ వెల్లలాగే, అకిలా దనంజయ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

Advertisement
 
Advertisement
Advertisement