గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూ.. మ‌ళ్లీ డ‌కౌట్‌ | Sanju Samson wastes another chance to put career in jeopardy | Sakshi
Sakshi News home page

#Sanju Samson: గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూ.. మ‌ళ్లీ డ‌కౌట్‌

Jul 30 2024 9:03 PM | Updated on Jul 30 2024 9:15 PM

Sanju Samson wastes another chance to put career in jeopardy

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకోలేక‌పోయాడు. శ్రీలంక‌తో రెండో టీ20లో గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగిన శాంస‌న్‌.. ఇప్పుడు మూడో టీ20లో కూడా ఖాతా తెర‌వ‌కుండానే ఔట‌య్యాడు. 

ప‌ల్లెకెలె వేదిక‌గా జ‌రుగుతున్న ఆఖ‌రి టీ20లో నాలుగు బంతులు ఎదుర్కొన్న శాంస‌న్‌.. డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరాడు. శ్రీలంక అరంగేట్ర బౌలర్ చమిందు విక్రమసింఘే బౌలింగ్‌లో హ‌స‌రంగాకు క్యాచ్‌కు ఇచ్చి సంజూ ఔట‌య్యాడు.  

ఈ క్ర‌మంలో నెటిజ‌న్లు శాంస‌న్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని అంద‌రూ అంటున్నారు.. ఇస్తే ఇదేనా ఆడే తీరు అని ఓ యూజ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇలా అయితే జ‌ట్టులో చోటు క‌ష్ట‌మ‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సంజూ డకౌట్‌ కావడంతో ఇకపై అతడిని టీ20లకు పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement