IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎం‍తంటే? | IND vs SL 3rd T20: Shubman gill, parag helps India post 137/9 | Sakshi
Sakshi News home page

IND vs SL 3rd T20: తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఎం‍తంటే?

Jul 30 2024 9:35 PM | Updated on Jul 30 2024 9:35 PM

IND vs SL 3rd T20: Shubman gill, parag helps India post 137/9

ప‌ల్లెకెలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న ఆఖ‌రి టీ20లో టీమిండియా బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగుల‌కే పరిమిత మైంది. లంక బౌల‌ర్ల దాటికి భార‌త బ్యాటర్లు వ‌రుసగా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో మహేష్‌ థీక్షణ మూడు వికెట్లతో సత్తాచాటగా.. హ‌స‌రంగా రెండు, విక్ర‌మ‌సింఘే, ఆసితా ఫెర్నాండో చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

భార‌త బ్యాట‌ర్ల‌లో శుబ్‌మ‌న్ గిల్‌(39) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రియాన్ ప‌రాగ్‌(26), వాషింగ్టన్‌ సుందర్‌(25) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కూడా ఈ మ్యాచ్‌లో త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. ఇక ఇప్ప‌టికే సిరీస్‌ను 2-0 తేడాతో భార‌త్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement