
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది.
భారత బ్యాటర్లలో అమన్‌జోత్ కౌర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(53), హర్లీన్ డియోల్(48) రాణించారు. ఒకనొక దశలో ఉమెన్ ఇన్ బ్లూ 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అమన్‌జోత్, దీప్తీ శర్మ ఏడో వికెట్‌కు 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత ఆఖరిలో స్నేహ్ రాణా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) దూకుడుగా ఆడింది. ఫలితంగా భారత్ మెరుగైన టోటల్‌ను సాధించగల్గింది. భారత స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన(8), రోడ్రిగ్స్(0), హర్మాన్ ప్రీత్ కౌర్(21), రిచా ఘోష్(2) తీవ్రనిరాశపరిచారు.
శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రభోదని రెండు, కులసూర్య, ఆతపట్టు తలా వికెట్ సాధించారు. రణవీర ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి భారత్‌కు ఊహించని షాకిచ్చింది.
చదవండి: ఆసియాకప్ ఫైనల్లో ఓటమి... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం