స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా.. రెంటిలో టీమిండియానే గెలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌ల్లో భారత్ ఏకపక్ష విజయాలు సాధించింది. తొలి టీ20లో 8 వికెట్లు, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయాలు నమోదు చేసింది.
సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 26) మూడో టీ20 జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే టాస్ గెలిచింది.
మూడో టీ20 కోసం భారత జట్టు రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్లు రేణుకా సింగ్, దీప్తి శర్మ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి బెంచ్‌కు పరిమితమయ్యారు. మరోవైపు ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఏకంగా మూడు మార్పులు చేసింది.
0-2తో వెనుకపడిపోయిన శ్రీలంక సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా భారతే గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ వశమవుతుంది.
తుది జట్లు..
శ్రీలంక: చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(w), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదర
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి


