చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు | Rohit Sharma creates history, breaks Sachin Tendulkars long-standing record | Sakshi
Sakshi News home page

IND vs SL: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు

Aug 5 2024 10:07 AM | Updated on Aug 5 2024 11:19 AM

Rohit Sharma creates history, breaks Sachin Tendulkars long-standing record

శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కొలంబో వేదికగా లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో హిట్‌మ్యాన్ 64 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు 121 సార్లు 50 ప్లస్ పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.

 సచిన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారత ఓపెనర్‌గా 120 సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్ ఆరో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌(146 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు 
1. డేవిడ్ వార్నర్ - 146 (374 మ్యాచ్‌లు)
2. క్రిస్ గేల్ - 144 (441 మ్యాచ్‌లు)
3. సనత్ జయసూర్య - 136 (: 506 మ్యాచ్‌లు)
4. డెస్మండ్ హేన్స్ - 131 ( 354 మ్యాచ్‌లు)
5. గ్రేమ్ స్మిత్ - 125 (342 మ్యాచ్‌లు)
6. రోహిత్ శర్మ - 121 (334 మ్యాచ్‌లు)

ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఈ ముంబైకర్ అధిగమించాడు. ధోనీ మొత్తం 10,773 సాధించగా.. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 10,831 చేరాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోనిని వెనక్కి నెట్టి ఐదో స్ధానానికి హిట్‌మ్యాన్ చేరుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement