నో అడ్మిషన్ బోర్డు
ఎయిర్‌పోర్టులో ల్యాండ్ సమయంలో ఘటన
హైదరాబాద్: సాధారణంగా సర్కార్ బడిలో ‘‘నో అడ్మిషన్ బోర్డు’’ చాలా అరుదు. అందులోనూ నగరంలో ఇంకా అరుదు. కానీ, ఫిలింనగర్‌లోని ఎంఆర్‌సీ కాలనీ ప్రాథమిక పాఠశాల చాలినంతమంది విద్యార్థులు చేరడంతో సోమవారం నో అడ్మిషన్ బోర్డు వేలాడదీశారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, 4, 5 తరగతుల్లో అడ్మిషన్లు తీసుకోవడం లేదని హెచ్‌ఎం ప్రభాకర్ తెలిపారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నాయకుల సిఫారసు లేఖలు కూడా తేవడం గమనార్హం.
విమానాన్ని తాకిన లేజర్ కాంతులు..
శంషాబాద్: ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానానికి లేజర్ కాంతులు తాకడంతో పైలట్ ఇబ్బంది పడ్డ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో రషీద్‌గూడ వైపు నుంచి లేజర్ కాంతులు పడ్డాయి. దీంతో పైలట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రషీద్‌గూడ వైపు ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలోంచి లేజర్ కాంతులు వచ్చినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.


