'ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వానా'.. తమన్నా ఆనందం చూశారా? | Tamannaah Bhatia Enjoying Rainy Season at Mumbai video Goes Viral | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: చిన్నపిల్లలా మిల్కీ బ్యూటీ.. వర్షంలో చిల్

Jul 2 2026 5:12 PM | Updated on Jul 2 2026 5:48 PM

Tamannaah Bhatia Enjoying Rainy Season at Mumbai video Goes Viral

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ఖుష్బు సుందర్ కుమార్తె వేడుకలో మెరిసిన ముద్దుగుమ్మ.. తాజాగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ముంబయిలో భారీ వర్షం కురవడంతో ప్రకృతిని ఆస్వాదించింది. తాను ఉండే ఇంటి బాల్కనీలో వర్షం పడుతున్న వేళ ఫుల్‌గా చిల్ అవుతూ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది తమన్నా. నాకు ఇంకా చల్లగానే ఉందని క్యాప్షన్ రాసుకొచ్చింది.

వర్షంలో తడుస్తూ చిన్న పిల్లలా ఎంజాయ్ చేసిన తమన్నాను చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడం గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది బాలీవుడ్ బ్యూటీ రషా తడాని.. నేను లేకుండా ఎలా చేశావ్? అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. మరోవైపు తమన్నా ప్రస్తుతం కేవలం బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్ తర్వాత దక్షిణాది సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement