భక్తిశ్రద్ధలతో బక్రీద్: హై అలర్ట్‌లో భద్రతా బలగాలు | Bakrid 2026, Nationwide Security High Alert As Eid ul Adha Celebrations Begin Across India, Watch Video Inside | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో బక్రీద్: హై అలర్ట్‌లో భద్రతా బలగాలు

May 28 2026 8:02 AM | Updated on May 28 2026 10:12 AM

Bakrid 2026 Nationwide Security High Alert as Eid ul Adha Celebrations Begin

న్యూఢిల్లీ: నేడు(గురువారం) దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను జరుపుకుంటున్నారు. మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిటకిటలాడుతున్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా ఏర్పాట్లు చేశారు.
 

నలుదిక్కులా నిఘా నేత్రాలు
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా యూపీలో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతోంది. ఢిల్లీలో భారీగా ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించగా, ముంబైలోని సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద పోస్టులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
 

నోయిడాలో కఠిన ఆంక్షలు
బక్రీద్ వేడుకల నేపథ్యంలో నోయిడా పోలీసులు మే 28 నుంచి 30 వరకు సెక్షన్ 163 అమలు చేశారు. అనుమతి లేకుండా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్, ఊరేగింపులు నిర్వహించకూడదని, వివాదాస్పద స్థలాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మహిళల భద్రత కోసం..
అన్ని రాష్ట్రాల్లోని పోలీసు యంత్రాంగం ప్రజలకు శాంతి, సౌహార్దంతో పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దించారు. ఎలాంటి ప్రలోభాలకు, వదంతులకు లోనుకాకుండా సంయమనం పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఒక సాధారణ మోడల్ ఎలా ‘కోకైన్ క్వీన్’ అయ్యింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement