Pune: భారీ వర్షం మధ్య గణపతికి ఆహ్వానం | Punekars Welcome Ganpati Bappa Amid Heavy Rains; 3,959 Mandals Set Up in City | Sakshi
Sakshi News home page

Pune: భారీ వర్షం మధ్య గణపతికి ఆహ్వానం

Aug 27 2025 11:45 AM | Updated on Aug 27 2025 11:49 AM

Punekars Welcome Ganpati Bappa with Devotion

పూణె: భారీవర్షం నడుమ మహారాష్ట్రలోని పూణెవాసులు గణపతికి స్వాగతం పలికారు.
 

నగరంలో ప్రముఖంగా నెలకొల్పిన కస్బా గణపతి, తంబ్డి జోగేశ్వరి గణపతి, గురూజీ తాలిమ్ గణపతి, తులసిబాగ్ గణపతి, కేసరివాడ గణపతి, దగ్దుషేత్ హల్వాయి గణపతి, భౌసాహెబ్ రంగరి గణపతి తదితర వినాయక మండలాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

నగరం అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది పలువురు తమ ఇళ్లకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నగరంలో మొత్తం 3,959 గణేశ్‌ మండపాలు ఏర్పాటయ్యాయి.

ఉత్సవాలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు పూణే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఇందుకోసం ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలతో కూడిన నిఘా కెమెరాలు, ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు, మొబైల్ నిఘా వాహనాలు, డ్రోన్ ఆధారిత వైమానిక పర్యవేక్షణ, జీపీఎస్‌ ట్రాకర్లు వినియోగిస్తున్నారు.

రాష్ట్ర శబ్ద కాలుష్య నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతులిచ్చారు.

శాంతిభద్రతల దృష్ట్యా ఆగస్టు 27, సెప్టెంబర్ 6వ తేదీలలో పూణే జిల్లా అంతటా మద్యం అమ్మకాలు నిషేధించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement