ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా? | Pune Police Nab Youth After Viral ‘Catch Me If You Can’ Challenge on Ninja Bike | Sakshi
Sakshi News home page

ఏరా చిన్నా.. పోలీసులతోనే ఆటలా?

Nov 14 2025 1:42 PM | Updated on Nov 14 2025 1:50 PM

Maharashtra Pune Biker Catch Me Challange Police Did This Viral

నిండా పాతికేళ్లు కూడా లేని ఓ కుర్రాడు పోలీసులకే సవాల్‌ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి.. అంటూ పుష్ప రేంజ్‌ సవాల్‌ విసిరాడు. సోషల్‌ మీడియాలో అది కాస్త వైరల్‌ అయ్యింది. అటు ఇటు తిరిగి ఖాకీలకు చేరడంతో వాళ్లూ దానిని అంతే సీరియస్‌గా తీసుకున్నారు. "Catch Me If You Can" అంటూ సవాల్ చేసిన ఓ యువకుడిని పట్టుకుని ఓ వీడియో తీయించారు. 

పుణెలో ఓ కుర్రాడు తన కవాసాకి నింజా బైక్‌కు "Will Run" అనే నెంబర్‌ ప్లేట్‌ పెట్టి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ మరో కుర్రాడు ఆ బైక్‌ తీసి వైరల్‌ చేశాడు. ఈ పోస్ట్‌ను గమనించిన పుణె పోలీసులు "We can, and we will" అంటూ స్పందించారు. 

 

కొన్ని గంటల్లోనే రాహిల్‌ను గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతని బైక్, అతని క్షమాపణ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ తప్పు చేశాను, మీరు చేయకండి" అంటూ రాహిల్ వీడియోలో చెప్పాడు. సదరు యువకుడ్ని 21 ఏళ్ల రాహిల్‌గా, వీడియో పోస్ట్‌ చేసింది అతని స్నేహితుడు నితీష్‌గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. పోలీసులు "Street's not the place to play, boy!" అంటూ గట్టిగా హెచ్చరించారు. 

ఇదే తరహాలో గత వారం గురుగ్రామ్‌లో ఇద్దరు యువకులు బైక్ మీద మద్యం సేవిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై కూడా అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, ప్రజల భద్రతకు ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement